టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి(Dhoni latest news) భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మిస్టర్ కూల్‌పై అభిమానులు తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. తాజాగా మహీ వీరాభిమాని మరోసారి పెద్ద సాహసమే చేసి మనసు దోచుకున్నాడు(dhoni fan walked 1400 km).
హరియాణాకు చెందిన అజయ్ గిల్.. తన ఫేవరెట్‌ను కలిసేందుకు మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఏకంగా 1436 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు(dhoni fan walks). హరియాణాలోకి తన గ్రామం నుంచి కాలినడకన రాంచిలోని మహీ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నాడు(Dhoni farmhouse).
ఈ విషయం తెలుసుకున్న ధోనీ తన అభిమానిని ఇంటికి ఆహ్వానించి అతడితో ముచ్చటించాడు. తన ఫామ్‌హౌస్‌లో అతడు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. మళ్లీ అతడిని తన స్వగ్రామానికి పంపించేందుకు విమాన టికెట్ కూడా బుక్ చేశాడు. దీంతో సదరు అభిమాని ఎంతో సంతోషపడిపోయాడు.
అంతకుముందు ఆగస్టులోనూ పాదయాత్ర చేసుకుంటూ ధోనీ ఇంటికి చేరుకున్నాడు అజయ్. కానీ ఆ సమయంలో ఐపీఎల్ రెండోదశ ఉండటం వల్ల మహీ.. దుబాయ్‌లో ఉన్నాడు. అయితే మిస్టర్ కూల్ వచ్చేంతవరకు తాను మహీ ఫామ్‌హౌస్ దగ్గరే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు. కానీ పలువురు సామాజిక కార్యకర్తలు అతడికి నచ్చజెప్పి తన స్వగ్రామానికి తిరిగి పంపించారు.
ఇదీ చదవండి: