ETV Bharat / sports

టెస్టుల్లో అత్యధిక సిక్స్​ల వీరులు వీరే! - క్రిస్ గేల్

క్రికెట్​లో ఓపిక, సహనానికి మరో పేరు టెస్టు ఫార్మాట్​. అలాంటి ఆటలో పరుగులు సాధించాలంటే ఎక్కువగా సింగిల్స్, డబుల్స్​తోనే సాధ్యం. మరి బౌండరీలు అంటే కష్టమనే చెప్పాలి. బ్యాట్స్​మెన్ కూడా ఫోర్లు, సిక్సర్లకు కాస్త దూరంగానే ఉంటారు. అయితే సుదీర్ఘ ఫార్మాట్​లోనూ సిక్స్​లు, ఫోర్లతో ఆటకే ఊపు తెచ్చిన కొందరు ఆటగాళ్లు ఉన్నారు. వారెవరో చూద్దాం.

Most Sixes in Test Cricket | List of Most Sixes by a Batsman in Test Cricket
Most Sixes: టెస్టుల్లో అత్యధిక సిక్స్​ల వీరులు వీరే
author img

By

Published : Jun 7, 2021, 5:32 PM IST

ఓ క్రికెటర్​ తనను తాను నిరూపించుకునేందుకు సరైన వేదిక టెస్టు ఫార్మాట్​. క్రీజులో కుదురుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. వీలైనన్నీ ఎక్కువ బంతులు ఆడటానికి వీలుంటుంది. ఇందులో సింగిల్స్​, డబుల్స్​తోనే స్కోరు బోర్డు కదులుతుంది. అలాంటిది బంతిని స్టాండ్స్​లోకి పంపడమంటే అరుదనే చెప్పాలి. కానీ, టెస్టుల్లోనూ తమదైన దూకుడును చూపించిన బ్యాట్స్​మెన్ కొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో బంతిని స్టాండ్స్​లోకి పంపి టెస్టులకు ఊపు తెచ్చిన వారెవరు? సుదీర్ఘ క్రికెట్​లో వారు కొట్టిన సిక్స్​లు ఎన్ని? ఇలాంటి బ్యాట్స్​మెన్ జాబితాను ఓ సారి తెలుసుకుందామా..

బ్రెండన్​ మెక్​కల్లమ్..

Most Sixes in Test Cricket | List of Most Sixes by a Batsman in Test Cricket
బ్రెండన్ మెక్​కల్లమ్

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్​ మెక్​కల్లమ్​.. క్రీజులోకి దిగాడంటే చాలు ఫార్మాట్ ఏదైనా బౌండరీల మోత మోగాల్సిందే. టెస్టుల్లో అత్యధిక సిక్స్​ల రికార్డూ ఈ కివీస్ క్రికెటర్​ పేరు మీదే ఉంది. తన కెరీర్​లో 101 టెస్టులు ఆడిన బ్రెండన్​.. మొత్తం 107 సిక్స్​లతో పాటు 776 ఫోర్లు బాదాడు. 64.6 స్ట్రైక్​ రేట్​, 38.64 సగటుతో సుదీర్ఘ ఫార్మాట్​లో 6453 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలతో పాటు 31 అర్ధ శతకాలు ఉన్నాయి. తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన ఫీట్​ కూడా ఇతడి పేరు మీదనే ఉంది.

ఆడమ్ గిల్​క్రిస్ట్​..

ఆడమ్​ గిల్​క్రిస్ట్​

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్​ గిల్​క్రిస్ట్​.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 137 ఇన్నింగ్స్​ల్లో 100 బంతులను స్టాండ్స్​లోకి పంపాడు. వీటితో పాటు 677 బౌండరీలు బాదాడు. ఈ ఫార్మాట్​లో 81.95 స్ట్రైక్​ రేట్​, 47.60 సగటుతో మొత్తంగా 5570 పరుగులు చేశాడు గిల్​క్రిస్ట్​. ఇందులో 17 శతకాలతో పాటు 26 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో ఇతడి అత్యధిక స్కోరు 204*.

ఇదీ చదవండి: 'జడేజా అసలైన 3డీ ప్లేయర్.. ఎందుకంటే?'

క్రిస్ గేల్..

క్రిస్ గేల్

యూనివర్స్​​ బాస్​ క్రిస్​ గేల్.. బరిలోకి దిగాడంటే మ్యాచ్​కే ఊపొస్తుంది. కెరీర్​లో 103 టెస్టులాడిన గేల్​.. 7214 రన్స్​ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 15 సెంచరీలతో పాటు 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్​లో గేల్.. 98 సిక్స్​లతో పాటు 1046 ఫోర్లు బాదాడు. కెరీర్​లో అత్యుత్తమ ఇన్నింగ్స్​ 333 పరుగులు శ్రీలంకపై సాధించాడు.

జాక్వెస్ కలిస్..

జాక్వెస్ కలిస్

దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ జాక్వెస్​ కలిస్.. 1995-2003 మధ్య కాలంలో 166 టెస్టులు ఆడాడు. 55.37 సగటుతో మొత్తం 13,289 పరుగులు సాధించాడు. ఇందులో 45 శతకాలతో పాటు 58 అర్ధ శతకాలు ఉన్నాయి. సుదీర్ఘ క్రికెట్​లో 97 సిక్స్​లతో పాటు 1488 ఫోర్లు కొట్టాడు కలిస్.

వీరేంద్ర సెహ్వాగ్..

వీరేంద్ర సెహ్వాగ్

భారత మాజీ డాషింగ్ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​.. టెస్టుల్లోనూ వేగంగా పరుగులు సాధించాడు. అతడి కెరీర్​లో 82.33 స్ట్రైక్​ రేట్​తో మొత్తం 8586 రన్స్ చేసిన వీరూ.. 91 సిక్స్​లతో పాటు 1233 బౌండరీలు బాదాడు. ఇందులో 23 సెంచరీలు 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 100 కంటే తక్కువ బంతుల్లో 7 సార్లు శతకాలు చేశాడు. ఈ అరుదైన ఘనత కూడా సెహ్వాగ్ పేరిటే ఉంది.

ఇదీ చదవండి: Ajinkya Rahane: టీమ్ఇండియా ఆపద్బాంధవుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.