ETV Bharat / sports

భారతీయ వైద్యుడికి జెర్సీ బహుకరించిన పాక్ క్రికెటర్ - మహ్మద్ రిజ్వాన్ భారతీయ డాక్టర్

టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్​కు ముందు అస్వస్థతకు గురైన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్​ ఐసీయూలో చికిత్స తీసుకుని మరీ బరిలో దిగాడు. ఆస్పత్రిలో ఇతడికి వైద్యం చేసింది ఓ భారతీయుడు. మ్యాచ్ అనంతరం ఆ డాక్టర్​ను కలిసిన రిజ్వాన్​.. అతడికి తన జెర్సీ బహుమతిగా అందించాడు.

Rizwan
Rizwan
author img

By

Published : Nov 13, 2021, 12:42 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్​కు ముందు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్. అతడిని దుబాయ్​లోని ఓ ఆస్పత్రిలో చేర్చగా.. రెండు రోజులపాటు ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. మ్యాచ్​లోపు ఫిట్​గా మారి మళ్లీ బరిలో దిగాడు రిజ్వాన్. అలాగే సెమీస్​లో హాఫ్ సెంచరీతో అలరించి పాక్ మంచి స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

Rizwan
ఐసీయూలో రిజ్వాన్

భారతీయ డాక్టర్ సాయంతో

ఆ ఆస్పత్రిలో రిజ్వాన్​కు ట్రీట్​మెంట్ చేసిన వైద్యుడు ఓ భారతీయుడు. ఆయన పేరు సహీర్ సైనలబ్దీన్. దీంతో ఆసీస్​తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ డాక్టర్​ను కలిసిన రిజ్వాన్​.. అతడికి తన జెర్సీని బహుమతిగా అందించాడు. మ్యాచ్ సమయానికి అతడిని ఫిట్​గా తయారు చేసినందుకు ఆ వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు రిజ్వాన్. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు డాక్టర్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆసీస్​తో మ్యాచ్​కు ముందు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్​తో ఆస్పత్రిలో చేరారు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, రిజ్వాన్. మాలిక్ సమస్య చిన్నదే అయినా.. రిజ్వాన్​ సమస్యను తీవ్రంగా పరిగణించిన వైద్యులు అతడిని ఐసీయూలో ఉంచి ట్రీట్​మెంట్ ఇచ్చారు. అనంతరం కోలుకుని మ్యాచ్​లో బరిలో దిగిన రిజ్వాన్​ ఓపెనర్​గా వచ్చి 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

ఇవీ చూడండి: 'రోహిత్​కు కెప్టెన్సీ ఇచ్చి కోహ్లీ బ్యాటర్​గా కొనసాగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.