ETV Bharat / sports

'కోహ్లీసేనలో స్పష్టత లేదు.. ఆ మార్పు అవసరం'

author img

By

Published : Jul 15, 2021, 6:49 PM IST

టీమ్​ఇండియాలో(Teamindia) జట్టు కూర్పులో సరైన స్పష్టత ఉండట్లేదని మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్(Mohammed kaif)​ అన్నాడు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని చెప్పాడు. మరోవైపు భారత మహిళల జట్టు నిర్భయంగా తయారవ్వడానికి 'సైద్ధాంతిక మార్పులు' అవసరమని ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌ అభిప్రాయపడ్డారు.

kohli
కోహ్లీ

కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) నడిపిస్తున్న టీమ్‌ఇండియాలో(Teamindia) సరైన స్పష్టత లేదని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌(Mohammed kaif) అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని మీడియా, అభిమానులు అంగీరించాలని సూచించాడు. జట్టును ఎంపిక చేసే విషయంలో విరాట్​కు స్పష్టత కొరవడిందని తెలిపాడు.

"టీమ్‌ఇండియాలో సరైన స్పష్టత లేదు. అది మనం అంగీకరించాలి. విరాట్ ఇలా ఉండకూడదు. ఆటగాళ్లలో ఎవరు ఫామ్‌లో ఉంటే వాళ్లనే జట్టులోకి తీసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో చివరికి అతడెన్ని ట్రోఫీలు సాధించాడో అని ప్రశ్నించాల్సి ఉంటుంది. అప్పుడు అతడేం సాధించలేదని తెలుస్తుంది. ఈ జట్టు, యాజమాన్యం.. ఆటగాళ్లు గతంలో ఏం చేశారనేదానికి ప్రాధాన్యత ఇవ్వరు. దాంతో ఈ భారత జట్టులో ఎవరి స్థానమూ కచ్చితం కాదు. అది ఆటగాళ్లకు కూడా తెలుసు"

-కైఫ్‌, మాజీ క్రికెటర్​.

అనంతరం తన కెప్టెన్‌ గంగూలీపై(Ganguly) స్పందించిన మాజీ బ్యాట్స్‌మన్‌.. దాదా ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించేవాడని చెప్పాడు. అతడు కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో 20-25 మంది మాత్రమే జట్టులోకి అందుబాటులో ఉండేవారని, అప్పుడు ఐపీఎల్‌ లాంటి టోర్నీ లేకపోవడం వల్ల ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పెద్ద తలనొప్పులు ఉండేవి కాదని అన్నాడు. దాంతో గంగూలీ తన సహచరులను బాగా వెన్నుతట్టేవాడని కైఫ్‌ వివరించాడు. అలా ఆటగాళ్లను ఎక్కువ రోజులు ప్రోత్సహించకపోతే కీలక సమయాల్లో రాణించరని విశ్లేషించాడు.

సైద్ధాంతిక మార్పులు అవసరం

టీమ్‌ఇండియా మహిళల జట్టు(Teamindia women) నిర్భయంగా తయారవ్వడానికి 'సైద్ధాంతిక మార్పులు' అవసరమని ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌(Ramesh Powar) అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్‌ టీమ్‌ 1-2 తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన పొవార్‌ క్రికెటర్ల ఆలోచనా విధానం మారాలన్నాడు. లేదంటే జట్టు అవసరాలకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేసే కొత్త ప్లేయర్లను తీసుకురావాలని చెప్పారు. సీనియర్‌ ప్లేయర్‌, కెప్టెన్‌ మిథాలి రాజ్‌(Mithali Raj) బాగా ఆడుతున్నా ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేందుకు మరో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ కావాలని తెలిపారు.

"భారత మహిళలు జట్టు పటిష్ఠంగా ఆడాలి. తొలి సిరీస్‌లోనే నేను ప్లేయర్లపై ఒత్తిడి పెంచలేను. వాళ్లొక సిద్ధాంతంతో ఆడుతున్నారు. ఇప్పటికిప్పుడే అందులో మార్పులు చేయలేం. వాళ్లకేం అవసరమో అంచనా వేయాలి. మిడిల్‌ ఆర్డర్‌లో నెమ్మదిగా ఆడుతున్న వారికి పరిస్థితులను తెలియజేసి, వారితో మాట్లాడటానికి చాలా సమయం పడుతుంది. ఆధునిక క్రికెట్‌ అంటే భయంలేకుండా ఆడటమే. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే రెండే విధాలున్నాయి. ఒకటి వారిని అవసరాలకు తగ్గట్టు మల్చుకోవడం లేదా కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడం. ఈ పర్యటనలో మేం కొన్ని ప్రయోగాలు చేశాం. అయితే, అవి అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఇక భవిష్యత్‌లో మరిన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. కొత్త వారిని తీసుకొచ్చి అనుకూలంగా మార్చుకోవాలి" అని పొవార్​ వివరించాడు.

ఇదీ చూడండి: Kohli: కొత్త ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.