ETV Bharat / sports

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా మిథాలీ - ఛార్లొటే ఎడ్వర్డ్స్

టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌ మరో అరుదైన ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్​గా రికార్డులకెక్కింది.

Mithali Raj
మిథాలీ రాజ్‌
author img

By

Published : Jul 3, 2021, 11:08 PM IST

అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది భారత క్రికెటర్, టీమ్​ఇండియా వన్డే జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​. అన్ని ఫార్లాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా నిలిచింది.

ఇంగ్లాండ్​ మహిళల జట్టుతో మూడో వన్డేలో.. ఈ ఫీట్​ సాధించింది మిథాలీ. ఆ టీమ్​కే చెందిన మాజీ క్రికెటర్​ ఛార్లొటే ఎడ్వర్డ్స్​ (10,273) ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా ఉంది. ఆమెను దాటేందుకు మిథాలీకి కేవలం 12 పరుగులు అవసరం కాగా, శనివారం నాటి ఇన్నింగ్స్​​తో అది కాస్తా పూర్తి చేసింది.

మిథాలీ ఘనతలు..

  • వన్డేల్లోనూ 7 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్​ ఉమెన్​ మిథాలీనే.
  • ఎక్కువ వన్డే మ్యాచ్​లు ఆడిన మహిళా క్రికెటర్​
  • అన్ని ఫార్మాట్లలో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్​ ఉమెన్​

తొలి రెండు మ్యాచ్​ల్లో ఓడి సిరీస్​ కోల్పోయిన భారత్​.. చివరి వన్డేలో విజయం దిశగా కొనసాగుతోంది. 220 పరుగుల లక్ష్యఛేదనలో 34 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మిథాలీ(32), దీప్తి శర్మ(1) క్రీజులో ఉన్నారు.

ఇవీ చూడండి:

సచిన్​కు చేరువలో మిథాలీ.. క్రికెట్​లో సరికొత్త ఫీట్​

ఖేల్​రత్న పురస్కారం కోసం అశ్విన్, మిథాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.