ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ మరోసారి టీమ్‌ఇండియాను ఎగతాళి చేశాడు! మహిళల క్రికెట్ జట్టును ప్రశంసిస్తూ కోహ్లీసేనపై వెటకారం గుప్పించాడు. కనీసం ఒక భారత జట్టైనా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో పోరాడుతోందని ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు పర్యటిస్తున్నాయి. ఏకైక టెస్టు మ్యాచును డ్రా చేసుకున్న మిథాలీ సేన 3 వన్డేల సిరీసును 2-0 చేజార్చుకుంది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. తొలి వన్డేతో పోలిస్తే రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శనే చేసింది. దీనిపై స్పందిస్తూ.. "భారత మహిళల జట్టు ఈ రోజు అద్భుత పోరాటం చేసింది.. ఇంగ్లీష్ పరిస్థితుల్లో కనీసం ఒక భారత జట్టైనా ఆడటం చూస్తుంటే బాగుంది.." అని ట్వీట్ చేశాడు వాన్. దీనిపై నెటిజన్లు అతడిపై ఫైర్ అవుతున్నారు.
-
The Indian women’s team are putting in an excellent display today … Good to see at least 1 Indian cricket team can play in English conditions … 😜😜
— Michael Vaughan (@MichaelVaughan) June 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Indian women’s team are putting in an excellent display today … Good to see at least 1 Indian cricket team can play in English conditions … 😜😜
— Michael Vaughan (@MichaelVaughan) June 30, 2021The Indian women’s team are putting in an excellent display today … Good to see at least 1 Indian cricket team can play in English conditions … 😜😜
— Michael Vaughan (@MichaelVaughan) June 30, 2021
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే, మహిళల జట్టు రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రెండింటినీ పోలుస్తూ వాన్.. పై ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే కోహ్లీసేన రెండు ఇన్నింగ్సుల్లో 217, 170 మాత్రమే చేసింది. రెండో వన్డేలో మిథాలీ జట్టు 221 పరుగులు చేయడం గమనార్హం.