ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నడి రోడ్డుపై చెంప దెబ్బలు తిన్న సంఘటన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. అయితే తాజాగా దీనిపై క్లార్క్ స్పందించాడు. "ఇలాంటి సంఘటన పట్ల ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను అత్యంత గౌరవ స్థానంలో ఉండేందుకు మీరంతా సహకారం అందించారు. మహిళలను ఆకర్షించుకొని ఇలాంటి పరిస్థితికి దిగజారినట్లు వచ్చిన ఆరోపణలు నన్ను మానసికంగా కుంగదీశాయి" అని క్లార్క్ వెల్లడించాడు.
అసలేం జరిగిందంటే.. తనను మోసం చేస్తున్నాడని క్లార్క్ గర్ల్ ఫ్రెండ్ జేడ్ యార్బ్రో అతడిని బహిరంగంగానే చెంప దెబ్బలు కొట్టింది. వేరే అమ్మాయితో ఉంటూ తనను మోసం చేస్తున్నాడని ఆరోపించింది. శారీరక సంబంధం పెట్టుకున్నాడని విమర్శలు గుప్పించింది. ఆమెతో చేసిన చాటింగ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేసింది.
అయితే ఆ సమయంలో స్పందించిన అక్కడి క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు.. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బందికరంగా ప్రవర్తించినందుకు మైకెల్ క్లార్క్, జేడ్ యార్బ్రోకు జరిమానా విధించారు. వారిని విచారించారు. ఆ తర్వాత.. పబ్లిక్ న్యూసెన్స్ కింద ఫైన్ విధించామని, మరే ఇతర నేరం జరిగినట్లు తమ దర్యాప్తులో తేలలేదని సదరు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం బీసీసీఐ కామెంటేటరీ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న క్లార్క్‌ను తొలగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వచ్చే నెలలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి.
ఇదీ చూడండి: IND vs NZ: రోహిత్‌కు వింత అనుభవం.. పీకల్లోతు కష్టాల్లో కివీస్