ETV Bharat / sports

టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​లో నిలిచే జట్లు ఇవేనా?

ICC t20 World Cup 2022 : 2022 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్​ రేసులో ఆ మూడు జట్లు నిలుస్తాయని ఆసీస్​ మాజీ ఆటగాడు మైఖేల్​ బెవన్​ తెలిపాడు. ఆ మూడు జట్లు ఏవంటే?

icc t20 world cup 2022 michael bevan
icc t20 world cup 2022 michael bevan
author img

By

Published : Oct 5, 2022, 4:29 PM IST

ICC t20 World Cup 2022 : ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలుత రౌండ్‌ 1 మ్యాచ్‌లు జరగనుండగా.. అక్టోబర్‌ 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ ఈవెంట్‌ కోసం అన్ని ప్రధాన జట్లు సన్నద్దం అవుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడుపుతున్నాయి.

కాగా ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్‌ బరిలో నిలిచే మూడు ఫేవరెట్‌ జట్లను ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైఖేల్ బెవన్ ఎంచుకున్నాడు. వాటిలో అతిధ్య ఆస్ట్రేలియా, టీమ్​ఇండియా, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అన్ని జట్ల కంటే భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు అద్భుతంగా ఉన్నాయని బెవన్ తెలిపాడు.

"టీ20 ప్రపంచకప్‌-2022 టైటిల్‌ రేసులో భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా నిలుస్తాయని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం జట్లు ఫామ్‌ బట్టి చూస్తే టీమ్​ఇండియా, ఇంగ్లండ్‌ ముందంజలో ఉన్నాయి. అదే విధంగా ఆస్ట్రేలియాను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారు తమ ఫామ్‌ను కొనసాగిస్తే.. ఆసీస్‌కు కూడా టైటిల్‌ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ మెగా ఈవెంట్‌ స్వదేశంలో జరగనుండడం ఆస్ట్రేలియాకు కలిసి వస్తుంది" అని బెవన్ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి : బుమ్రా స్థానంలో ఎవరు అన్నది అప్పుడే నిర్ణయిస్తాం: రోహిత్‌

Commonwealth Games 2026: షూటింగ్‌ ఇన్​.. రెజ్లింగ్‌ ఔట్​.. భారత్​ మెడల్స్​పై ఎఫెక్ట్​ ఉంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.