ETV Bharat / sports

'మెంటార్​ ఏమీ చేయడు.. బాధ్యత మిడిలార్డర్​దే' - gavaskar on virat captaincy

టీ20 ప్రపంచకప్​లో భారత్, పాకిస్థాన్​ జట్లు(Ind vs Pak T20 World Cup) ఫైనల్​లో తలపడితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar News). మెంటార్​గా ధోనీ(Dhoni Mentor) బాధ్యతలపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు గావస్కర్.

sunil gavaskar
సునీల్ గావస్కర్
author img

By

Published : Oct 22, 2021, 8:58 PM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ సందర్భంగా భారత్, పాకిస్థాన్​ జట్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్. ఈ మెగాటోర్నీ ఫైనల్లో భారత్, పాక్(Ind vs Pak t20 World Cup)​ ఆడితే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దుబాయ్​లో నిర్వహించిన సలామ్​ క్రికెట్(Salaam Cricket 2021)​ కార్యక్రమంలో పాల్గొన్న గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరో రెండు రోజుల్లో టీమ్​ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాక్​తో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. ఐసీసీ కూడా భారత్, పాక్​ ఫైనల్లో ఆడాలని భావిస్తుందని, అందరి ఆశ కూడా ఇదేనని గావస్కర్​ పేర్కొన్నాడు. టీమ్​ఇండియా మెంటార్​ ధోనీపై(Dhoni Mentor) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

"మెంటార్​ తాను చేయాల్సిన సహాయం చేస్తాడు. బౌలర్లు, బ్యాట్స్​మెన్​తో బ్రేక్​ సమయాల్లో మాట్లాడగలడు. డ్రెస్సింగ్ రూమ్​లో సలహాలు ఇవ్వగలడు. మైదానంలో విజృంభించాల్సింది మాత్రం ఆటగాళ్లే. ముఖ్యంగా మిడిలార్డర్. వాళ్లు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారనేదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది."

-సునీల్ గావస్కర్, మాజీ ఆటగాడు.

టీ20 ప్రపంచకప్​ అనంతరం విరాట్​ కోహ్లీ కెప్టెన్సీ(virat captaincy news) వదులుకుంటానని చెప్పాడు కాబట్టి అతడిపై ఒత్తిడి తక్కువగా ఉంటుందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అదనపు బాధ్యతల గురించి ఆలోచించనప్పుడే కోహ్లీ తన ఫామ్​పై ఫోకస్​ చేస్తాడని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:

'భారత్‌- పాక్‌ ప్రపంచకప్‌ రికార్డులు ఎవరూ పట్టించుకోరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.