Mayank Agarwal Century: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సూచన మేరకు తన బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు చేసుకున్నట్లు భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ (120*) మొదటి రోజే శతకంతో చెలరేగిపోయాడు. జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి నెలకొన్న వేళ అద్భుతమైన ఆటతో జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు ఆట అనంతరం మాట్లాడిన మయాంక్ పలు విషయాలపై స్పందించాడు.
"తుది జట్టులో చోటు దక్కిన తర్వాత రాహుల్ ద్రవిడ్ నాతో మాట్లాడాడు. 'నీ చేతుల్లో ఉన్న దాన్ని నియంత్రించుకోవాలి. మైదానంలో అడుగుపెట్టి ఉత్తమ ప్రదర్శన చేయాలి. ఒక్కసారి కుదురుకుంటే భారీ స్కోరు సాధించాలి' అని చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నా. నా ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాట్‌ను కాస్త కిందకు పెట్టి ఆడమని గావస్కర్ సలహానిచ్చాడు. బ్యాట్‌ను పైకి ఎత్తి పట్టుకోవడం అలవాటు. కానీ గావస్కర్ బ్యాటింగ్ వీడియోలు చూసి దాన్ని మార్చుకున్నా. తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు తీసిన అజాజ్‌పై ఎదురు దాడి చేయాలనుకున్నా. అనుకూలమైన బంతి పడగానే భారీ షాట్లు ఆడా. శనివారం ఆటలో తొలి సెషన్ కీలకం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే మా దృష్టి. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ బ్యాటింగ్‌కు ఈ పిచ్ కఠినంగా మారుతుంది" అని చెప్పుకొచ్చాడు.
తొలి రోజు ఆట ముగిసి సమయానికి 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది టీమ్ఇండియా. మయాంక్ (120*) అజేయ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. ఇతడికి సాహా (25*) మద్ధతుగా నిలుస్తున్నాడు. గిల్ (44) పర్వాలేదనిపించగా.. పుజారా (0), కోహ్లీ (0), శ్రేయస్ (18) నిరాశపర్చారు.