Punjab kings Captain Mayank Agarwal: ఐపీఎల్ వేలం పూర్తవడం, పలు ప్రాంఛైజీలు కెప్టెన్లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఏ ఈ క్రమంలో భారత బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించే యోచనలో పంజాబ్ కింగ్స్ ఉన్నట్లు ఉంది. ఈ వారం చివరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని క్రికెట్ వర్గానికి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. వేలంకు ముందే మయాంక్(రూ.12కోట్లు), పేసర్ హర్షదీప్సింగ్ను(రూ.4కోట్లు) పంజాబ్ రిటెయిన్ చేసుకుంది.
"ధావన్ ఛాంపియన్ ఆటగాడు. అతడు జట్టులోకి రావడం వల్ల అదనపు బలం చేకూరుతుంది. రాహుల్ జట్టును వదిలిపెట్టిన నాటి నుంచి మయాంక్‌నే కెప్టెన్‌గా అనుకున్నాం"అని క్రికెట్ వర్గానికి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.
పంజాబ్ మెగావేలంలో మంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లింవింగ్స్టోన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, తమిళనాడు సంచలనం షారుక్ ఖాన్‌ను దక్కించుకుంది.
గత కొన్ని సంవత్సారాలుగా మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ జోడీ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసింది. జట్టుకు నుంచి బయటకు వచ్చిన రాహుల్ ప్రస్తుతం కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతేడాది రాహుల్‌కు గాయమైన సమయంలో మయాంక్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుభవం కూడా ఉంది. గత రెండు సీజన్లలో 400కు పైగా పరుగులు సాధించాడు. 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతడు 100కు పైగా మ్యాచులు ఆడగా..భారత్ తరఫున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.
ఇప్పటి వరకూ కప్పు గెలవని పంజాబ్ ఈ సారైనా ట్రోఫీని దక్కించుకోవాలని ఆశలు పెట్టుకుంది. 2014లో ఫైనల్లో అడుగుపెట్టిన పంజాబ్ గత మూడు సీజన్లలోనూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇదీ చదవండి: IND VS SL: కోహ్లీ, షోయబ్ రికార్డుకు చేరువలో రోహిత్