ETV Bharat / sports

IND VS SL: భారత్​తో సిరీస్​కు ఆ స్టార్​ క్రికెటర్​ ఔట్​

author img

By

Published : Jul 7, 2021, 6:16 PM IST

భారత్​తో జరగబోయే సిరీస్​కు లంక సీనియర్​ క్రికెటర్​ ఏంజిలో మాథ్యూస్​ అందుబాటులో ఉండట్లేదని తెలిపింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. అతడు త్వరలోనే రిటైర్మెంట్​ ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Mathews
ఏంజిలో మాథ్యూస్

శ్రీలంక క్రికెట్​ బోర్డు ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వరుస ఓటములు, బోర్డు-క్రికెటర్ల మధ్య విభేదాలు రావడమే ఇందుకు కారణం. ఇందులో భాగంగా జాతీయ కాంట్రాక్ట్​పై సంతకం చేయడానికి అక్కడి స్టార్​ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. సీనియర్​ బ్యాట్స్​మన్​ ఏంజిలో మాథ్యూస్​​ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డుకు కూడా చెప్పినట్లు తెలిసింది.

భారత్​తో​ సిరీస్​కు ఔట్​

మరోవైరు భారత్​తో జరిగే మూడు వన్డేలు(జులై 13-18) మూడు టీ20లు(జూలై 21-25) సిరీస్​కు 30మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది లంకబోర్డు. వీరంతా జాతీయ కాంట్రాక్ట్​పై సంతకాలు చేయడానికి అంగీకరించడం వల్ల వీరిని బోర్డు తీసుకుంది. ఇందులో మాథ్యూస్​ కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ సిరీస్​ నుంచి​ తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.

లంక బోర్డు కాంట్రాక్ట్​ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన ఆటగాళ్లను ముందుండి నడిపించిన మాథ్యూస్​.. అనూహ్యంగా కాంట్రాక్ట్​పై సంతకం చేయడానికి అంగీకరించడం గమనార్హం. 2009లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేసి మాథ్యూస్​.. కెరీర్​లో 90 టెస్టులు(6,236), 218 వన్డేలు(5,835), 78 టీ20లు(1148) ఆడాడు.

ఇదీ చూడండి: 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' రేసులో షెఫాలీ, స్నేహ్​ రాణా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.