ETV Bharat / sports

చెన్నై పగ్గాలు మళ్లీ ధోనీ చేతికి.. కెప్టెన్సీ వదిలేసిన జడేజా - రవీంద్ర జడేజా

dhoni jadeja
dhoni jadeja
author img

By

Published : Apr 30, 2022, 7:40 PM IST

Updated : Apr 30, 2022, 8:10 PM IST

19:35 April 30

చెన్నై కెప్టెన్సీ వదులుకున్న జడేజా

Jadeja Resigns Chennai Captaincy: చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు కెప్టెన్‌ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సీఎస్కే జట్టు సారథిగా వ్యవహరిస్తున్న జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ బాధ్యతలను ఎంఎస్‌ ధోనీకి అప్పగించాలని యజమాన్యాన్ని కోరాడు. దీనికి ధోనీ కూడా అంగీకరించినట్లు సీఎస్​కే తన ట్విట్టర్‌లో ప్రకటించింది. దీంతో సీఎస్‌కే ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఇక ఈ సీజన్‌లో సీఎస్‌కే ఎనిమిది మ్యాచులు ఆడి రెండు గెలిచి.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌ అవకాశాలు కష్టమే అయినప్పటికి ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌ గెలిస్తే సీఎస్‌కేకు అవకాశం ఉంటుంది. మరి గతంలో ధోనీ నాయకత్వంలోనే సీఎస్‌కే నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. సీజన్‌ ఆరంభానికి ముందే ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల జడేజాను కెప్టెన్‌గా నియమించారు. కానీ కెప్టెన్సీ భారాన్ని మోయలేక జడేజా చేతులెత్తేశాడు. కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో జడ్డూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

Last Updated : Apr 30, 2022, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.