ETV Bharat / sports

ఇద్దరు విండీస్​ స్టార్​ క్రికెటర్లు రిటైర్మెంట్ - Denesh Ramdin news

వెస్టిండీస్​ స్టార్​ క్రికెటర్లు లెండిల్​ సిమన్స్​, వికెట్​ కీపర్​ బ్యాటర్​ దినేశ్​ రామ్​దిన్​ తమ క్రికెట్​ కెరీర్​కు గుడ్​బై చెప్పారు. ఈ ఇద్దరూ దాదాపు 15 సంవత్సరాల పాటు క్రికెట్లో కొనసాగారు.

Lendl Simmons, Denesh Ramdin announces retirement from international cricket
ఇద్దరు విండీస్​ స్టార్​ క్రికెటర్లు రిటైర్మెంట్
author img

By

Published : Jul 19, 2022, 10:34 AM IST

Updated : Jul 19, 2022, 11:34 AM IST

వెస్టిండీస్​ తరఫున సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రికెటర్లు.. ఆటకు గుడ్​బై చెప్పారు. తొలుత వికెట్​ కీపర్​ బ్యాటర్​ దినేశ్​ రామ్​దిన్​ రిటైర్మెంట్​ ప్రకటించగా.. సోమవారం అర్ధరాత్రి సమయంలో క్రికెట్​ నుంచి తప్పుకుంటున్నట్లు లెండిల్​ సిమన్స్​ ట్విట్టర్​లో వెల్లడించాడు.

37 ఏళ్ల సిమన్స్​.. చివరిసారి గతేడాది జరిగిన టీ-20 వరల్డ్​ కప్​లో ఆడాడు. 3 ఫార్మాట్లలో కలిపి 144 మ్యాచ్​లు ఆడిన ఈ విధ్వంసకర ఓపెనర్​.. 3,763 పరుగులు చేశాడు. టీ-20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. వన్డేల్లో రెండు సెంచరీలు ఉన్నాయి. 2006లో తొలి వన్డే ఆడిన సిమన్స్​.. మొత్తం 16 ఏళ్లు క్రికెట్​లో కొనసాగాడు.

2016 టీ-20 ప్రపంచ కప్​ వెస్టిండీస్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సిమన్స్​. ఆ టోర్నీ సెమీఫైనల్లో భారత్​ను ఓడించి ఫైనల్​ చేరిన విండీస్​.. రెండో సారి టీ-20 వరల్డ్​కప్​ దక్కించుకున్న ఏకైక టీంగా నిలిచింది. ఆ మ్యాచ్​లో వెస్టిండీస్​ ముందు భారత్​ 193 పరుగుల లక్ష్యం నిర్దేశించినా.. సిమన్స్​ చెలరేగి ఆడాడు. 51 బంతుల్లోనే 82 పరుగులు చేసి మ్యాచ్​ను లాగేసుకున్నాడు. ఐపీఎల్​లోనూ ముంబయి ఇండియన్స్​ తరఫున ఆడాడు సిమన్స్​. మొత్తం 29 మ్యాచ్​ల్లో 40 సగటుతో 1079 రన్స్​ చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది.

రామ్​దిన్​ గుడ్​బై: మరో వెస్టిండీస్​ వికెట్​ కీపర్​- బ్యాటర్​, మాజీ కెప్టెన్​ దినేశ్​ రామ్​దిన్​ కూడా క్రికెట్​ నుంచి తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో.. 74 టెస్టులు ఆడి 2,898 పరుగులు చేశాడు. 139 వన్డేల్లో 2,200... 71 టీ-20ల్లో 636 రన్స్​ చేశాడు.

2005లో విండీస్​ తరఫున తొలి వన్డే ఆడాడు రామ్​దిన్​. చివరిగా 2019 డిసెంబర్​లో టీ-20 మ్యాచ్​ ఆడాడు. 2012, 2016లో టీ-20 వరల్డ్​కప్​ గెలిచిన విండీస్​ జట్టులో సభ్యుడు కూడా. 13 టెస్టులు, 3 టీ-20లు సహా ఓ వన్డేలో విండీస్​ జాతీయ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు.

ఇదీ చదవండి: దశాబ్దాల కల నెరవేర్చి.. క్రికెట్​ పుట్టినింటికి కప్పు తెచ్చి..

Last Updated : Jul 19, 2022, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.