ఐపీఎల్(IPL 2022 New Teams) కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటైన అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్స్(CVC capital india) సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi News) కూడా ఈ సంస్థకు ఫ్రాంచైజీ దక్కడంపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.
సీవీసీ క్యాపిటల్ సంస్థ(CVC betting company) ప్రముఖ బెట్టింగ్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై పలువురి విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది.
-
i guess betting companies can buy a @ipl team. must be a new rule. apparently one qualified bidder also owns a big betting company. what next 😳😳😳 - does @BCCI not do there homework. what can Anti corruption do in such a case ? #cricket
— Lalit Kumar Modi (@LalitKModi) October 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">i guess betting companies can buy a @ipl team. must be a new rule. apparently one qualified bidder also owns a big betting company. what next 😳😳😳 - does @BCCI not do there homework. what can Anti corruption do in such a case ? #cricket
— Lalit Kumar Modi (@LalitKModi) October 26, 2021i guess betting companies can buy a @ipl team. must be a new rule. apparently one qualified bidder also owns a big betting company. what next 😳😳😳 - does @BCCI not do there homework. what can Anti corruption do in such a case ? #cricket
— Lalit Kumar Modi (@LalitKModi) October 26, 2021
"బెట్టింగ్ కంపెనీలు కూడా ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయొచ్చన్నమాట. ఇది బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ అనుకుంటా. ప్రస్తుతం ఓ ఫ్రాంఛైజీ దక్కించుకున్న బిడ్డర్‌కు పేరుమోసిన బెట్టింగ్ సంస్థ కూడా ఉంది. బీసీసీఐ ఈ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోలేదా ఏంటి?. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ ఎలా పనిచేస్తుంది?."
--లలిత్ మోదీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్.
అయితే.. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు సంబంధించిన బిడ్డింగ్ పద్ధతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగిందన్నారు.
ఐపీఎల్లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్ సొంతం చేసుకుంది. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్ అధినేత సంజీవ్ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కడంలో గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: