టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మోకాలి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"సర్జరీ విజయవంతంగా పూర్తయింది. కోలుకునే స్థితిలో ఉన్నా. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం నా ఆలోచన అంతా వీలైనంత తొందరగా మైదానంలో అడుగుపెట్టడంపైనే."
-కుల్దీప్, టీమ్ఇండియా క్రికెటర్
ఐపీఎల్ 2021లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ తరఫున యూఏఈ వెళ్లాడు కుల్దీప్ యాదవ్. అయితే ఇతడికి ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు. కాగా, ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే అతడి మోకాలికి గాయమైంది. దీంతో సర్జరీ కోసం ముంబయికి వచ్చాడు. ప్రస్తుతం రికవరీలో ఉన్న ఇతడు దాదాపు 5-6 నెలలు క్రికెట్కు దూరం కానున్నాడు. దీంతో రంజీ ట్రోఫీలోనూ పాల్గొనే వీలులేదు.