టీమ్ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఓ గెస్ట్ హౌజ్‌లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడమే ఇందుకు కారణం. దీనిపై కాన్పూర్ పాలకమండలి విచారణకు ఆదేశించింది.
ఏం జరిగింది?
ఈ నెల 15న కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపాడు కుల్దీప్ యాదవ్. అందుకు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇతడు వ్యాక్సిన్ కోసం జోగేశ్వర్ ఆస్పత్రిలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా కాన్పూర్ నగర్ నిగమ్ గెస్ట్ హౌజ్‌లో టీకా వేయించుకున్నాడు. దీంతో ఇతడిపై విమర్శలు వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కాన్పూర్ పాలకమండలి అతడిపై విచారణకు ఆదేశించింది. కొందరు నెటిజన్లు కూడా ఆస్పత్రిలో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో ఎలా వ్యాక్సిన్ వేస్తారంటూ మండిపడుతున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించలేకపోయాడు కుల్దీప్. ఫామ్ లేమి కారణంగా ఇతడిని ఈ సిరీస్ నుంచి తప్పించింది సెలక్షన్ కమిటిీ. అయితే ఇదే సమయంలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఇతడని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.