ETV Bharat / sports

వరల్డ్​ కప్​ ఓటమి నన్ను వెంటాడింది : కుల్దీప్ యాదవ్ - కుల్దీప్ యాదవ్ పుట్టినరోజు

Kuldeep Yadav On India World Cup 2023 Loss : వరల్డ్​కప్​లో టీమ్ఇండియా ఓటమిపై జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందించాడు. ఆ ఓటమి తనను వెంటాడిందని, పది రోజుల పాటు కష్టం అనుభవించానని తెలిపాడు. ఇంకా ఏమన్నాడంటే?

Kuldeep Yadav On India World Cup 2023
Kuldeep Yadav On India World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 2:39 PM IST

Updated : Dec 15, 2023, 6:54 PM IST

Kuldeep Yadav On India World Cup 2023 Loss : ఇటీవల వరల్డ్​కప్​ ఫైనల్​లో టీమ్ఇండియా ఓడిపోయి మూడోసారి టైటిల్​ను ముద్దాడలేకపోయింది. కానీ లీగ్​ మొత్తం మంచి ప్రదర్శన చేసిన భారత జట్టు టోర్నీలో విజయవంతమైన టీమ్​గా నిలిచింది. అయితే ఫైనల్​లో భారత ఓటమిపై స్టార్ స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్ స్పందించాడు. జట్టులోని అందరి సభ్యులాగానే తాను కూడా వరల్డ్​ కప్​ ఓటమిని జీర్జించుకోలేకపోయానని తెలిపాడు. ఆ పరాజయం తనను వెంటాడిందని చెప్పాడు. 7 నుంచి 10 రోజుల వరకు నిద్ర లేస్తే అదే విషయం వెంటాడేదన్నాడు. అయితే జీవితం మారుతుందుని, ముందుకు సాగుతుందని చెప్పాడు.

మరోవైపు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో టీమ్​ఇండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. తన స్పిన్‌ మయాజాలంతో ప్రత్యర్థి టీమ్​ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్దీప్‌ 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

"నాకు దక్షిణాఫ్రికా సిరీస్​లో ఆడే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ చివరిసారిగా 2018లో ఆడాను. కాబట్టి నాకు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. క్రికెట్‌లో మీరు కోరుకున్నది ఎప్పటికీ జరగదు. మీరు అలాంటి వాటి నుంచి నేర్చుకుంటారు. భవిష్యత్ మ్యాచ్‌లలో నేర్చుకున్న వాటిని అమలు చేయాలి' అని మ్యాచ్​ తర్వాత చెప్పాడు కుల్దీప్​.

కాగా ఇంటర్​నేషనల్​ టీ20 కెరీర్‌లో కుల్దీప్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. టీ20ల్లో కుల్దీప్‌కు ఇది రెండో ఐదు వికెట్ల ప్రదర్శన. ఇదిలా ఉండగా గురువారం (డిసెంబర్‌ 14) కుల్దీప్‌ 29వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. అయితే ప్రపంచ టీ20 క్రికెట్‌లో పుట్టిన రోజు నాడు అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఈ ప్లేయర్​ రికార్డు సృష్టించాడు.

'నాకు ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా మారింది. ఐదు వికెట్లు తీయడం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు గెలవాలని మాత్రమే నేను కోరుకున్నాను. నేను నా బౌలింగ్ గురించి ఆందోళన చెందాను. ఎందుకంటే నేను కొంతకాలం గ్యాప్ తర్వాత ఆడుతున్నాను. కాబట్టి నా రథమ్​ను పొందాలనుకుంటున్నాను. ఇది నాకు పర్​ఫెక్ట్​ రోజు' అని కుల్దీప్ అన్నాడు.

వరల్డ్​కప్​లో మెస్సీ​ ధరించిన జెర్సీలకు రికార్డు ధర- వేలంలో ఆరు టీషర్టులకు రూ.64 కోట్లు!

BCCI మాస్టర్​ ప్లాన్​ - IPL తరహాలో టీ10 లీగ్​కు శ్రీకారం!

Last Updated : Dec 15, 2023, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.