కొవిడ్‌తో పోరాడుతున్న బాధితులకు సాయం చేయడానికి టీమ్ఇండియా క్రికెటర్లు హర్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య.. మరోసారి ముందుకొచ్చారు. ఆక్సిజన్ సంక్షోభంలో ఉన్న కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.
"కొవిడ్‌తో బాధపడుతున్న వారికి అందించేందుకు మరికొన్ని ఆక్సిజన్ కాన్సట్రేటర్లను పంపిణీ చేస్తున్నాం. వారందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం" అని కృనాల్ ట్వీట్ చేశాడు.
"మహమ్మారితో చేస్తున్న పోరాటంలో మనం మధ్యలో ఉన్నాం. కలిసికట్టుగా పని చేస్తే దానిప విజయం సాధించవచ్చు" అని హర్దిక్ పేర్కొన్నాడు.
-
We’re in the middle of a tough battle that we can win by working together 🙏 https://t.co/VHgeX2NKIT
— hardik pandya (@hardikpandya7) May 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We’re in the middle of a tough battle that we can win by working together 🙏 https://t.co/VHgeX2NKIT
— hardik pandya (@hardikpandya7) May 24, 2021We’re in the middle of a tough battle that we can win by working together 🙏 https://t.co/VHgeX2NKIT
— hardik pandya (@hardikpandya7) May 24, 2021
ఈ నెలారంభంలో పాండ్య సోదరులు తమ కుటుంబం తరఫున 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సాయంగా అందించారు. వాటన్నిటిని గ్రామీణ ప్రాంతాల్లో కరోనాతో పోరాడుతున్న వారికి ఇవ్వాల్సిందిగా కోరారు.
ఇదీ చదవండి: కరోనా బాధితుల కోసం బీసీసీఐ సాయం