ETV Bharat / sports

'నువ్వు సూపర్​స్టార్​'.. కోహ్లీకి యూవీ స్పెషల్​ గిఫ్ట్

Yuvaraj Singh Kohli: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీకి ఓ స్పెషల్​ గిఫ్ట్​ను పంపించాడు మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​. దీంతో పాటే అతడిని ప్రశంసిస్తూ ఓ హృదయపూర్వక లేఖను రాశాడు. విరాట్​ గొప్ప నాయకుడని, భావి తరాల వారికి స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడాడు.

Yuvaraj Singh Kohli
కోహ్లీ యువరాజ్​ సింగ్​
author img

By

Published : Feb 22, 2022, 1:19 PM IST

Updated : Feb 22, 2022, 1:31 PM IST

Yuvaraj Singh Kohli: టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​.. మాజీ కెప్టెన్ విరాట్​​ కోహ్లీకి ఓ ప్రత్యేక బహుమతిని పంపాడు. అతడికి గోల్డెన్​ షూస్​ను కానుకగా ఇచ్చాడు. దీంతో పాటే అతడిని ప్రశంసిస్తూ ఓ హృదయపూర్వక లేఖను రాశాడు. తన కళ్ల ముందే కోహ్లీ ఓ ఆటగాడిగా, వ్యక్తిగా ఎంతో ఎదిగాడని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అతడి ఆట పట్ల ఉన్న నిబద్ధత​, క్రమశిక్షణ.. భావి తరాల వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడాడు.

  • To the little boy from Delhi @imvkohli
    I want to dedicate this special shoe to you,celebrating your career n time as captain which has brought smiles to millions of fans all over the world.
    I hope you stay the way YOU are, play the way YOU do and keep making the country proud! pic.twitter.com/mwVPPh0JwU

    — Yuvraj Singh (@YUVSTRONG12) February 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"విరాట్.. ఓ క్రికెటర్​గా, వ్యక్తిగా నువ్వు ఎదగడం నేను చూశాను. నెట్స్​లో కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి దిగ్గజాలతో కలిసి ఆడే స్థాయికి ఎదిగావు. ఇప్పుడు నువ్వూ ఓ దిగ్గజ ఆటగాడివే. కొత్త తరానికి మార్గదర్శివి. నెట్స్​లో నీ క్రమశిక్షణ, మైదానంలో ఆట పట్ల నీ ప్యాషన్​, డెడికేషన్.. దేశంలో ఉన్న ప్రతి పిల్లవాడికి​ ఏదో ఓ రోజు టీమ్ఇండియా జెర్సీ ధరించి, బ్యాట్​ పట్టుకోవాలని అనిపించే స్ఫూర్తినిస్తుంది. ప్రతిఏడాది నీ క్రికెట్​ జ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చావు. ఈ ఆటలో ఎంతో సాధించావు. ఓ లెజెండరీ కెప్టెన్​, గొప్ప నాయకుడివి అయ్యావు. నీ నుంచి మరెన్నో గొప్ప ఇన్నింగ్స్​ రావాలని కోరుకుంటున్నాను. సహచర ఆటగాడిగా, స్నేహితుడిగా నీతో ఉన్న బంధం గురించి మాటల్లో చెప్పలేను. కలిసి పరుగులు చేయడం, డైట్​ విషయంలో చీటింగ్​.. పంజాబీ పాటలు వినడం, కప్​ సాధించడం.. వీటన్నింటిలో మనం కలిసే ఉన్నాం. నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లీవి కావొచ్చు. కానీ నాకు మాత్రం ఎప్పటికీ 'చీకూ'వే. నీలోని పట్టుదల, గెలవాలన్న కసి, దూకుడుతనం ఎప్పటికీ అలానే ఉండాలి. నువ్వు సూపర్​స్టార్​. నీకోసమే ఈ ప్రత్యేక గోల్డెన్​ షూ. ఇలాగే ఎప్పటికీ దేశాన్ని గర్వపడేలా చేయ్​"

-యువరాజ్​ సింగ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

కాగా, గత కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల వల్ల వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో ఓడిపోయిన నేపథ్యంలో టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అన్ని ఫార్మాట్లలో రోహిత్​ శర్మ బాధ్యతలను స్వీకరించాడు.

ఇదీ చూడండి: అతడి కెరీర్​ను నాశనం చేయాలనుకోవట్లేదు: సాహా

Last Updated : Feb 22, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.