నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గావస్కర్ తొలి టెస్టులో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 212 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 120 పరుగులు చేసి రికార్డుకెక్కాడు. కానీ జస్ట్ మిస్‌లో రోహిత్ శర్మ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే రోహిత్‌కు సారీ చెప్పాడు కోహ్లీ. ఇంతకీ ఏం జరిగిందంటే..
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేసిన నాథన్ లయన్ బౌలింగ్‌లో ఐదో బంతిని విరాట్ కోహ్లీ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో విరాట్ సింగిల్ కోసం ముందుకు వచ్చి నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మను పిలిచాడు. దాంతో రోహిత్ పరుగు కోసం పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. అయితే బంతి నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్లడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్న కోహ్లీ.. రోహిత్ శర్మకు సడన్‌గా నో అంటూ మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు.
అయితే అప్పటికే పిచ్ మధ్యలోకి వెళ్లపోయిన రోహిత్ శర్మ అదే వేగంతో మళ్లీ వెనుక్కి వచ్చాడు. అయితే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న లియాన్ స్టంప్స్ పడగొట్టినప్పటికీ.. రోహిత్ శర్మ అద్భుతమైన డైవ్‌తో క్రీజులోకి చేరుకున్నాడు. కాస్తలో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే తన వల్ల రనౌట్ అయ్యే ప్రమాదంలో పడ్డ రోహిత్ శర్మకి వెంటనే క్షమాపణలు చెప్పాడు కోహ్లీ. దానికి స్పందించిన హిట్‌మ్యాన్ పర్వాలేదులే అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
- — Nitin Varshney (@NitinVa15588475) February 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Nitin Varshney (@NitinVa15588475) February 10, 2023
">— Nitin Varshney (@NitinVa15588475) February 10, 2023