ETV Bharat / sports

Kohli captaincy: 'వన్డే, టెస్టుల్లోనూ కోహ్లీ కెప్టెన్సీ వదులుకుంటాడు!' - రోహిత్ శర్మ

విరాట్​ కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ ప్రధాన (Ravi Shastri News) కోచ్ రవిశాస్త్రి. కోహ్లీ.. త్వరలోనే ఇతర ఫార్మాట్లలోనూ (Virat Kohli Captaincy) కెప్టెన్సీ వదిలేసే అవకాశముందని అన్నాడు.

Virat Kohli
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Nov 12, 2021, 10:21 PM IST

ఇప్పటికే టీ20 పగ్గాలు వదిలేసిన విరాట్​ కోహ్లీ.. ఇతర ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ (Virat Kohli Captaincy) వదులుకునే అవకాశం ఉందని చెప్పాడు టీమ్​ఇండియా మజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ప్రత్యేకించి కొవిడ్ సమయంలో పనివల్ల కలిగే ఒత్తిడిని అధిగమించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అన్నాడు.

Virat Kohli
కెప్టెన్​గా విరాట్​ కోహ్లీ

కోహ్లీ సారథ్యంలో టెస్టుల్లో ఐదేళ్లుగా టీమ్​ఇండియా అగ్రస్థానంలో ఉంది. మానసిక అలసట కారణంగా.. 'నేను నా బ్యాటింగ్​పై దృష్టిసారించాలని అనుకుంటున్నా' అంటూ అతడు కెప్టెన్సీని వదులుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాతైనా అలా జరుగుతుంది. వన్డేల్లోనూ అదే జరగొచ్చు. అది అతడే నిర్ణయించుకుంటాడు. బ్యాటింగ్​పై శ్రద్ధ పెట్టేందుకు ఎందరో విజయవంతమైన క్రికెటర్లు కెప్టెన్సీ వదిలేశారు. అయితే వన్డేల్లో సారథ్యం వదిలేసి, టెస్టుల్లో కొనసాగాలని అతడు భావిస్తే చాలామంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే.. టెస్టు క్రికెట్​కు అతడే అత్యుత్తమ ప్రతినిధి"

- రవిశాస్త్రి, టీమ్​ఇండియా మాజీ హెడ్​ కోచ్

టీ20 ప్రపంచకప్​తో(T20 World Cup 2021) కోచ్​గా శాస్త్రి పదవీకాలం ముగిసింది. నవంబర్​ 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్​తో (New Zealand Tour of India) జరిగే టీ20 సిరీస్​, ఒక టెస్టు​ వరకు కోహ్లీకి విశ్రాంతి లభించింది. అప్పటివరకు టీ20లకు రోహిత్ శర్మ, ఎర్ర బంతి ఫార్మాట్​కు రహానెకు(Rahane News) సారథిగా బాధ్యతలు అప్పగించారు. రెండో టెస్టులో కోహ్లీ.. మళ్లీ నాయకుడిగా (Virat Kohli Captaincy News) జట్టుతో చేరనున్నాడు.

ఐపీఎల్​ (IPL 2021) జరిగిన వెంటనే ప్రపంచకప్​ ఆడటం టీమ్ఇండియాకు చేటు చేసిందని రవిశాస్త్రి అన్నాడు. అయితే అందుకు బీసీసీఐని తప్పుబట్టడం లేదని, రీషెడ్యూలింగ్​ కరోనా కారణంగానే జరిగిందని చెప్పాడు. "బీసీసీఐ మాత్రమే కాదు, ప్రతీ జట్టు షెడ్యూలింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్​ కూడా కలిపితే ప్రపంచంలోని ఏ జట్టు ఆడనన్ని మ్యాచ్​లు భారత్​ ఆడుతోంది." అని శాస్త్రి వివరించాడు.

అందుకే వదిలేశాడు..!

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) తర్వాత పొట్టి ఫార్మాట్​ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు సెప్టెంబర్ 16న వెల్లడించాడు కోహ్లీ. పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

"భారత్​కు కెప్టెన్​గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నా. సారథిగా నా జర్నీలో అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, సెలక్షన్​ కమిటీ, కోచ్​లు, ప్రతి భారతీయుడి ప్రార్థనలతోనే ఇదంతా సాధించా. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లకు ఆడుతున్నా. ఐదారేళ్లుగా 3 ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా. పని ఒత్తిడి కారణంగా ఇప్పుడు తప్పుకొంటున్నా. టెస్టు​, వన్డేలలో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు ఇది దోహదపడుతుంది. టీ20 కెప్టెన్​గా నా కెరీర్​లో జట్టుకు కావాల్సిన ప్రతిదీ చేశా. టీ20 బ్యాట్స్​మన్​గా కొనసాగుతాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. రవిభాయ్​, రోహిత్​తో ఎన్నో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా, సెలక్టర్లతో మాట్లాడాను. నా వంతుగా జట్టుకు అత్యుత్తమ సేవలందిస్తా."

-కోహ్లీ.

కెప్టెన్​గా 45 టీ20లకు సారథ్యం వహించాడు కోహ్లీ. అందులో 29 గెలవగా.. 13 ఓడిపోయాడు. రెండు మ్యాచ్​ల్లో ఫలితాలు తేలలేదు. అతడి విజయ శాతం 65.11గా ఉంది.

ఇదీ చూడండి: కోహ్లీ పాత్రను తక్కువ చేయలేం: నెహ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.