ETV Bharat / sports

ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లిన కోహ్లీ.. కానీ ఈ సారి సూర్య మాత్రం.. - తాజా టీ20 ర్యాంకింగ్స్​

పాకిస్థాన్​పై అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్​ కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్​లో అదరగొట్టాడు. అయితే టాప్​ ప్లేస్​లో ఉన్న సూర్యకుమార్​ యాదవ్​ మాత్రం కిందకి పడిపోయాడు. ఇంతకీ విరాట్​, సూర్య ర్యాంక్ ఎంతంటే?

kohli t20 rankings
కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్​
author img

By

Published : Oct 26, 2022, 5:17 PM IST

పాకిస్థాన్​పై విరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన విరాట్‌ కోహ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు.. 14వ స్థానంలో ఉన్న అతడు పాక్‌పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్‌10లో చోటు దక్కించుకన్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో అతడు 635 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

గతేడాది నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ అనంతరం కోహ్లీ, ఐసీసీ టీ 20 టాప్‌ 10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. ఏడాది తర్వాత అదే ఐసీసీ టోర్నీలో రాణించి తిరిగి టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. మొన్నటిదాకా రెండో స్థానంలో ఉన్న స్టార్​ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 828 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.

పాక్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 849 పాయింట్లతో తొలిస్థానం నిలబెట్టుకోగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్‌ కాన్వే రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ నాలుగు, దక్షిణాఫ్రికా హిట్టర్‌ మార్‌క్రమ్‌ ఐదోస్థానంలో నిలిచాడు. టీమ్‌ఇండియా బ్యాటర్లు రోహిత్‌ శర్మ 16, కేఎల్ రాహుల్‌ 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి: T20 worldcup: టీమ్​ఇండియాకు చేదు అనుభవం.. ఆహారాన్ని తిరస్కరించిన ప్లేయర్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.