KL Rahul World Cup 2023 : ప్రపంచ కప్ ఆరంభం నుంచి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందిస్తూ మంచి ఫామ్‌లో ఉన్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్స్ మెషిన్.. టీమ్ఇండియాకు ఓ స్ట్రాంగ్ పిల్లర్‌లా మారాడు. ఈ క్రమంలో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గత వరల్డ్ కప్‌లో సెంచరీ మార్క్ అందుకోలేకపోయిన విరాట్.. ఈ ఏడాది మాత్రం శతకాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలోనే సెంచరీకి చేరువయ్యాడు.. కానీ 85 పరుగుల వద్ద ఔటై నిరాశతో వెనుతిరిగాడు. ఇక ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే సెంచరీ చేసే సమయానికే మ్యాచ్ పూర్తయింది. దీంతో అప్పుడు కూడా ఛాన్స్ మిస్ అయ్యింది.
ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేదు. సరిగ్గా అదే సమయంలో బంగ్లాతో మ్యాచ్ మొదలైంది. ఓపెనర్లుగా దిగిన రోహిత్, గిల్ తమ జోరును ప్రదర్శించడం వల్ల ఈ సారి కూడా కోహ్లీకి సెంచరీ చేసే ఛాన్స్ లేదనే అనుకున్నారు. కానీ రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో చెలరేగిపోయాడు. చివర్లో కేఎల్ రాహుల్ (34*)తో కలిసి మ్యాచ్‌ను సిక్సర్‌తో ముగించాడు.
అయితే రాహుల్‌తో పాటు ఆడుతున్న సమయంలో ఓ ఘటన జరిగింది. కోహ్లీ సింగిల్స్ తీయడానికి వస్తుంటే అందుకు రాహుల్ నిరాకరించాడు. సెంచరీ పూర్తి చేసుకో అంటూ సలహా ఇచ్చాడట. సరిగ్గా భారత్ విజయానికి, కోహ్లీ సెంచరీకి 15 పరుగులు అవసరమైన టైమ్‌లో కోహ్లీ సింగిల్స్ తీయబోయాడు. అయితే రాహుల్ మాత్రం సింగిల్ తీయడానికి అస్సలు ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత రాహుల్ మీడియాతో పంచుకున్నాడు.
"కోహ్లీ సింగిల్ తీద్దామంటే నేను వద్దన్నాను. దీంతో తను వచ్చి ఇలా చేస్తే చూడటానికి అస్సలు బాగోదన్నాడు. తానేదో వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నానని ప్రజలు అంటారని చెప్పాడు. అయితే నేను మాత్రం చాలా క్లియర్‌గా చెప్పాను. మనం ఈజీగా గెలిచే ప్లేస్‌లో ఉన్నాం. కాబట్టి అవేం ఆలోచించకుండా సెంచరీ పూర్తి చేసుకో అని సలహా ఇచ్చాను" అని రాహుల్ వెల్లడించాడు. దీంతో రాహుల్ బౌండరీలు, డబుల్స్‌తో చెలరేగిపోయాడు. చివర్లో భారీ సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. దీంతో సూపర్ విక్టరీతో పాటు ఓ సెంచరీ కూడా తన ఖాతాలో పడింది.
ICC Latest ODI Rankings Kohli : అదరగొట్టిన కోహ్లీ - కేెఎల్ రాహుల్.. ఏకంగా..