ETV Bharat / sports

రెండో టెస్టుకు ముందు కివీస్​​కు పెద్ద షాక్​.. కెప్టెన్​కు కరోనా - కేన్​ విలియమ్సన్​ కెప్టెన్​

Kane Williamson Covid: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్​ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు సారథి కేన్​ విలియమ్సన్​.. కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యాడు.

Williamson tests positive for Covid-19 on eve of second Test
Williamson tests positive for Covid-19 onv eve of second Test
author img

By

Published : Jun 10, 2022, 10:52 AM IST

Kane Williamson Covid: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ కొవిడ్‌ బారినపడ్డాడు. దీంతో శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టుకు అతడు దూరమయ్యాడు. విలియమ్సన్‌ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడి స్థానంలో హమిష్‌ రూథర్‌ఫర్డ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ మ్యాచ్‌కు కివీస్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ హెడ్‌కోచ్‌ గ్యారీ స్టెడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్‌ తొలి టెస్టును కోల్పోయింది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో విలియమ్సన్‌ లాంటి ప్రధాన బ్యాట్స్‌మన్‌ కీలకపోరుకు దూరమయ్యాడు. దీంతో ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను ఎలా ఎదుర్కోనుందో ఆసక్తిగా మారింది.

ఇవీ చదవండి: తీవ్ర విషాదం.. రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్​ మృతి

ఇండోనేసియా మాస్టర్స్​ క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.