ETV Bharat / sports

ICC Hall of Fame: హాల్​ ఆఫ్​ ఫేమ్​లో మరో ముగ్గురు దిగ్గజాలు

మరో ముగ్గురు క్రికెటర్లకు హాల్​ ఆఫ్​ ఫేమ్​లో (ICC Hall of Fame 2021) చోటు కల్పించి, గౌరవించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేలా జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్ షాన్ పొల్లాక్, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జానెటి బ్రిటిన్ ఉన్నారు.

ICC Hall of Fame
హాల్​ ఆఫ్​ ఫేమ్
author img

By

Published : Nov 13, 2021, 6:57 PM IST

Updated : Nov 13, 2021, 7:38 PM IST

ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్​లో (ICC Hall of Fame 2021) శ్రీలంక దిగ్గజం మహేలా జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్ షాన్ పొల్లాక్, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జానెటి బ్రిటిన్​కు చోటు దక్కింది. వీరితో కలిపి ఇప్పటివరకు 106 మంది క్రికెటర్లకు ఈ గౌరవం దక్కింది. క్రికెట్​లో మరపురాని ఘనతలు అందుకున్న వారిని 2009 నుంచి ఈ విధంగా గౌరవిస్తోంది ఐసీసీ.

ICC Hall of Fame
ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్​లో జయవర్ధనే, పొల్లాక్, బ్రిటిన్

బ్రిటిన్..

ఇంగ్లాండ్​కు టెస్టుల్లో 19 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించింది బ్రిటిన్ (Janette Brittin). 1979 నుంచి 1998 వరకు 27 టెస్టులు, 63 వన్డేలు ఆడిన బ్రిటిన్.. మహిళల క్రికెట్​లోనే గొప్ప బ్యాటర్​గా గుర్తింపు పొందారు. మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు (49.61 సగటుతో 1935), శతకాలు (5) సాధించింది.

ICC Hall of Fame
బ్రిటిన్

వన్డేల్లోనూ బ్రిటిన్ ఆధిపత్యం చాటింది. 42.42 సగటుతో 2121 పరుగులు చేసింది. 2017లో తుదిశ్వాస విడిచింది. ఇంగ్లాండ్​ తరఫున హాల్​ ఆఫ్​ ఫేమ్​లో చోటుదక్కించుకున్న 31 క్రికెటర్​ బ్రిటిన్.

మహేలా..

శ్రీలంక దిగ్గజ క్రికెటర్​గా రిటైరైన వ్యక్తి మహేలా జయవర్ధనే (Mahela Jayawardene News). 149 టెస్టులు, 448 వన్డేలు, 55 అంతర్జాతీయ టీ20ల్లో 652 మ్యాచ్​లు ఆడాడు (Mahela Jayawardene Stats) మహేలా. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన క్రికెటర్లలో 12 మ్యాచ్​ల తేడాతో సచిన్​ తెందూల్కర్​ మాత్రమే అతడి కన్నా ముందున్నాడు.

ICC Hall of Fame
జయవర్ధనే

వన్డేల్లో 33.37 సగటుతో 12,650 పరుగులు, 19 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 49.84 సగటుతో 11,814 పరుగులు, 34 శతకాలు (Mahela Jayawardene Centuries) బాదాడు జయవర్ధనే.

శ్రీలంక రెండు ప్రపంచకప్​లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

పొల్లాక్..

క్రికెట్​ చరిత్రలో అత్యుత్తమ ఆల్​రౌండర్లలో షాన్ పొల్లాక్ (Shaun Pollock Stats) ఒకరు. వన్డేలు, టెస్టుల్లో 3 వేల పరుగులు సహా 300 వికెట్లు తీసిన తొలి క్రికెటర్ అతడు.

ICC Hall of Fame
వికెట్ తీసిన ఆనందంలో పొల్లాక్

1995లో అరంగేట్రం చేసిన పొల్లాక్​.. కెరీర్​లో 108 టెస్టులు, 303 వన్డేలు, 12 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. 16 సార్లు ఒకే మ్యాచ్​లో 5 వికెట్లు పడగొట్టాడు (Shaun Pollock Cricket Records). టెస్టుల్లో మొత్తం 421 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరఫున డేల్ స్టెయిన్ మాత్రమే అతడి కన్నా ముందున్నాడు.

హాల్​ ఆఫ్​ ఫేమ్​లో భారతీయులు (ICC Hall of Fame From India)..

ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్​లో ఇప్పటివరకు ఏడుగురు భారత క్రికెటర్లకు చోటు లభించింది. వారు..

  • బిషన్ బేడీ- 2009
  • కపిల్ దేవ్ - 2009
  • సునీల్ గావస్కర్ - 2009
  • అనిల్ కుంబ్లే - 2015
  • రాహుల్ ద్రవిడ్ - 2018
  • సచిన్ తెందూల్కర్ - 2019
  • వినూ మన్కడ్ - 2021

ఇదీ చూడండి: ICC Hall of Fame: వినూ మన్కడ్​కు అరుదైన గౌరవం

Last Updated : Nov 13, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.