ETV Bharat / sports

కెప్టెన్సీ అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తా: బుమ్రా - టీమ్​ ఇండియా కెప్టెన్

Jasprit Bumrah on captaincy: టీమ్​ఇండియా కెప్టెన్సీ అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పాడు ఫాస్ట్ బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా. అలాంటి ఛాన్స్​ వస్తే ఏ ఆటగాడైనా వదులుకోడు అని తెలిపాడు. కెప్టెన్​గా కోహ్లీ సేవలు మరువలేనివని కొనియాడాడు. అతని సారథ్యంలోనే తాను అరంగేట్రం చేసినట్లు గుర్తు చేసుకున్నాడు.

Jasprit Bumrah
కెప్టెన్సీ అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తా: బుమ్రా
author img

By

Published : Jan 17, 2022, 5:55 PM IST

Jasprit Bumrah on captaincy: టీమ్​ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరిస్​కు ముందు మీడియా సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తనకు అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తానన్నాడు. భవిష్యత్తులో అలాంటి ఛాన్స్ వస్తే ఏ ఆటగాడు కూడా వదులుకోడు అని చెప్పాడు.

టీమ్​ఇండియా టెస్టు జట్టు కెప్టెన్గా​ తప్పుకుంటున్నట్లు విరాట్​ కోహ్లీ ప్రకటించడం క్రికెట్​ అభిమానులను షాక్​కు గురి చేసింది. అలాగే తదుపరి కెప్టెన్ ఎవరు అనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. రోహిత్ శర్మకు ఆ అవకాశం ఉన్నా.. వచ్చే ఏడాది అతడు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. దీంతో అతడు దీర్ఘకాలం కొనసాగటం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయమై బుమ్రాను ఓ వార్తా సంస్థ అడగ్గా.. అతడు ఈ విధంగా బదులిచ్చాడు.

" ఒకవేళ టీంఇండియా కెప్టెన్సీ అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తా. ఛాన్స్​ వస్తే ఏ ఆటగాడు కూడా వద్దని చెప్పడు. నేను కూడా అంతే. జట్టు నాయకుడిగా ఎవరు ఉన్నా.. నా శక్తిసామర్థ్యాల మేరకు నావంతు భాగస్వామ్యం అందిస్తా. ప్రస్తుత పరిస్థిని కూడా అలాగే చూస్తా. బాధ్యత తీసుకుని ఆటగాళ్లతో మాట్లాడటం, వారికి సాయం చేయడం నా పద్ధతి. ఇకముందు కూడా ఎలాంటి పరిస్థితిలోనైనా నా విధానంలో మార్పు ఉండదు."

-జస్​ప్రీత్ బుమ్రా.

టెస్ట్ జట్టు కెప్టెన్​గా తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగత విషయమని, దాన్ని అందరం గౌరవిస్తామని బుమ్రా తెలిపాడు. అతడు జట్టుకు అందించిన సేవలు మరువలేమన్నారు. తోటి ఆటగాళ్లలో ఎప్పుడూ జోష్ నింపడమే గాక, వాళ్లకు అన్ని విధాలుగా కోహ్లీ మద్దతుగా ఉంటాడని వివరించాడు. తన అరంగేట్రం కూడా కోహ్లీ సారథ్యంలోనే జరిగిందని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్​గా వైదొలుగుతున్నట్లు టీమ్ మీటింగ్​లోనే అతడు చెప్పాడని వెల్లడించాడు.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ను 2-1 తేడాతో కొల్పోయింది టీమ్ ఇండియా. మూడు వన్డేల సిరీస్​ బుధవారం ప్రారంభమవుతుంది. రోహిత్ దూరం కావడం వల్ల ఈ సిరీస్​కు కేఎల్ రాహుల్​ కెప్టెన్​గా, జస్​ప్రీత్​ బుమ్రా వైస్ కెప్టెన్​గా వ్యవహరించనున్నారు.

Team india new captain

ఇంకా సమయం ఉంది..

అయితే భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దానికి మరింత సమయముందని పేర్కొన్నారు.

'విరాట్‌ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో ఇంకా ఎవరి పేరు చర్చకు రాలేదు. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా సమయముంది. సరైన సమయంలో సెలెక్టర్లు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. టీమ్‌ఇండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ ఎంపిక ఉంటుంది. సెలెక్షన్ కమిటీ సిఫారసు మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం. రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌గా కొనసాగించాలనుకుంటున్నాం' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ భారత జట్టుని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. విదేశాల్లో అత్యంత విజయవంతమైన నాయకుడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టును అగ్రస్థానానికి చేర్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు కెప్టెన్‌గా ఎవరిని నియమించినా.. కఠిన సవాళ్లు ఎదుర్కోక తప్పదు. జట్టుని ముందుండి నడిపించడం అనుకున్నంత సులభం కాదన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతానికైతే, టెస్టు కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ ముందంజలో ఉన్నాడు. రోహిత్‌ శర్మను వైస్ కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: 100వ టెస్టుకు కెప్టెన్సీ ఆఫర్​.. తిరస్కరించిన కోహ్లీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.