ETV Bharat / sports

వన్డే ర్యాంకింగ్స్​లో మెరుగుపడ్డ శ్రేయస్​, రాహుల్​.. కోహ్లీ స్థానం ఎంతంటే? - రోహిత్​ శర్మ వన్డే ర్యాంకింగ్​

బుధవారం విడుదలైన ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్​​లో భారత ప్లేయర్లు​ శ్రేయస్​ అయ్యర్,​ కేఎల్​ రాహుల్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. అయితే రోహిత్​, కోహ్లీ ఏ స్థానాల్లో ఉన్నారంటే?

ICC Player Rankings For ODI Batsmen
ICC Player Rankings For ODI Batsmen
author img

By

Published : Dec 7, 2022, 4:45 PM IST

ICC ODI Rankings: ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్​ విడుదలయ్యాయి. టీమ్​ఇండియా ప్లేయర్లు శ్రేయస్​ అయ్యర్,​ కేఎల్​ రాహుల్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్​లో సాధించిన 24 పరుగులతో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 49 పరుగులు చేయడంతో అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు.

మిర్పూర్‌లో 73 పరుగులు చేసిన రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, స్టార్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ.. తమ తొమ్మిది, పది స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. టాప్​ 10లో టీమ్​ఇండియా నుంచి వీరిద్దరే ఉన్నారు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే.. భారత పేస్ ద్వయం మహ్మద్ సిరాజ్ , శార్దూల్ ఠాకూర్ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో సత్తా చాటడంతో పాయింట్​ టేబుల్​లో ఎగబాకారు. శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగతో కలిసి సిరాజ్ 26వ స్థానాన్ని పంచుకున్నాడు. ఠాకూర్ మాత్రం తొమ్మిది స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్​లో మార్నస్‌ లాబుషేన్‌ టాప్
ICC Test Rankings 2022: ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా ప్లేయర్​ మార్నస్‌ లాబుషేన్‌ టాప్​లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్​లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన లాబుషేన్‌.. 935 పాయింట్ల ఆధిక్యంతో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోరూట్‌ను అధిగమించి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో మొదటి స్థానంలో ఉన్న జో రూట్‌ నాలుగో ప్లేస్​కు షిప్టయ్యాడు.

మరోవైపు వెస్టిండీస్‌పై డబుల్‌ సెంచరీ సాధించిన స్మిత్‌ను రెండో ర్యాంక్‌, ఇంగ్లాండ్‌పై సెంచరీతో రాణించిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్​కు మూడో ర్యాంక్‌ వరించింది. అలాగే వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ టాప్‌ 20లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బ్రాత్‌వైట్‌ రెండు ఇన్నింగ్స్‌ కలిపి 174 పరుగులు సాధించాడు.
బౌలర్లలో విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ ఒక స్థానం ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించిన నసీం షా ఐదు స్థానాలు ఎగబాకి 54 వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.