ETV Bharat / sports

రంజీ ట్రోఫీకి అందుబాటులో ఇషాంత్​ శర్మ

author img

By

Published : Feb 17, 2022, 7:34 AM IST

Ishanth Sharma Ranji Trophy: రంజీ ట్రోఫీ ఆడే విషయంలో సీనియర్​ ఆటగాడు ఇషాంత్​ శర్మ మనసు మార్చుకున్నాడు. ఈ ట్రోఫీలో అతడు తిరిగి అందుబాటులో రానున్నాడు. దిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్న అతడు తన తొలి మ్యాచ్​ను ఈ నెల 24న ఝార్ఖండ్​తో ఆడనున్నాడు.

Ishanth Sharma Ranji Trophy
రంజీ ట్రోఫీ ఇషాంత్​ శర్మ

Ishanth Sharma Ranji Trophy: రంజీ ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సీనియర్​ పేసర్‌ ఇషాంత్‌ శర్మ మనసు మార్చుకున్నాడు. రంజీ ట్రోఫీకి తిరిగి అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడనున్న దిల్లీ జట్టుతో అతడు చేరతాడు. అయితే క్వారంటైన్‌ నిబంధనల వల్ల ఈ మ్యాచ్‌లో అతడు ఆడలేడు. ఈ నెల 24న ఆరంభమయ్యే దిల్లీ రెండో మ్యాచ్‌ (ఝార్ఖండ్‌తో)లో ఇషాంత్‌ బరిలోకి దిగుతాడు.

ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని నేపథ్యంలో ఇషాంత్‌ మనసు మార్చుకున్నాడని దిల్లీ క్రికెట్‌ సంఘానికి చెందిన ఓ అధికారి చెప్పాడు. ఇషాంత్‌కు టెస్టుల్లో తుది జట్టులో స్థానం కష్టంగా మారింది. సిరాజ్‌, ప్రసిద్ధ్‌ల ఎదుగుదలతో అతడి ప్రాధాన్యం తగ్గిపోయింది. 33 ఏళ్ల ఇషాంత్‌కు దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్టులోనూ ఆడే అవకాశం దక్కలేదు. మరో వైపు అండర్‌-19 కెప్టెన్‌ యశ్‌ ధుల్‌.. ధ్రువ్‌ షోరేతో కలిసి తమిళనాడుపై దిల్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు.

ఇదీ చూడండి: రంజీ ట్రోఫీ 2022.. రెండేళ్ల తర్వాత మళ్లీ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.