ETV Bharat / sports

ఐపీఎల్: కెప్టెన్సీనే కాదు.. జట్టులో చోటూ పోయింది! - స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ మార్పు

ఐపీఎల్​లో కెప్టెన్​గా రాణించిన కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. తాజాగా డేవిడ్ వార్నర్​ను కూడా సారథ్య బాధ్యతలతో పాటు జట్టు నుంచి తప్పించింది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్​లో కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న లేక తొలగించిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

captaincy change
ఐపీఎల్​లో కెప్టెన్సీ తొలగింపు
author img

By

Published : May 4, 2021, 9:46 AM IST

ఐపీఎల్ 14వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడుతుంటే.. మరికొన్ని జట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి అభిమానుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి. దీంతో ఓటమి బాట పట్టిన ఫ్రాంచైజీలు లీగ్ మధ్యలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా వరుస ఓటములతో ఢీలాపడ్డ సన్​రైజర్స్ హైదరాబాద్.. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్​ను తప్పిస్తూ అందర్నీ విస్మయానికి గురిచేసింది. సన్​రైజర్స్​ అంటే ఠక్కున గుర్తొచ్చే వార్నర్​ను తప్పించడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇలా లీగ్ మధ్యలోనే కెప్టెన్​ను తప్పించడం ఇదేమీ కొత్తకాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అవేంటో చూద్దాం.

డేవిడ్ వార్నర్

ఈ సీజన్​లో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్​లో తడబడ్డాడు డేవిడ్ వార్నర్. అందువల్ల ఇతడని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా తుది జట్టులోనూ చోటు కల్పించలేదు ఫ్రాంచైజీ. ఈ సీజన్​లో 110 స్ట్రైక్ రేట్​తో 193 పరుగులు చేశాడు వార్నర్. కాగా, ఇతడు ఈ సీజన్​లో మరోసారి తుదిజట్టులోకి రావడం అనుమానంగానే మారింది.

warner
వార్నర్

రికీ పాంటింగ్

2013 సీజన్​లో ముంబయి ఇండియన్స్​కు ఆడిన రికీ పాంటింగ్.. స్వయంగా అతడే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటూ.. తుదిజట్టులోనూ చోటు కోల్పోయాడు. తర్వాత ఈ బాధ్యతల్ని రోహిత్ శర్మకు అప్పగించింది యాజమాన్యం. ఇది ఈ జట్టు తలరాతనే మార్చింది. ముంబయిని లీగ్​లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలపడంలో రోహిత్​ కృషి మనందరికి తెలిసిందే. ఆ తర్వాత పాంటింగ్​ ఐపీఎల్​లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అనంతరం 2015 సీజన్​లో ముంబయికి కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు పాంటింగ్. ఈ సీజన్​లో రెండోసారి విజేతగా నిలిచింది రోహిత్​సేన. 2016 వరకు ముంబయికి కోచ్​గా ఉన్న ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం దిల్లీ క్యాటిపల్స్​కు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ponting rohit
పాంటింగ్, రోహిత్

గౌతమ్ గంభీర్

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ను రెండుసార్లు విజేతగా నిలిపాడు గౌతమ్ గంభీర్. 2018లో దిల్లీకి మారి ఆ జట్టుకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ సీజన్​లో ఆరు మ్యాచ్​ల్లో ఒకే మ్యాచ్ గెలవడం వల్ల కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు గౌతీ. ఆ తర్వాత జట్టుకు ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు. అనంతరం అదే ఏడాది డిసెంబర్​లో ప్రొఫెషనల్​ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు.

gambhir
గంభీర్

స్టీవ్ స్మిత్

మిగతావారిలా కాకుండా స్టీవ్ స్మిత్ ఒకే మ్యాచ్​కు బెంచ్​కు పరిమితమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. 2019 సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​కు తిరిగొచ్చిన ఇతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. అనంతరం బ్యాటింగ్​లో తగిన ప్రదర్శన చేయకపోవడం వల్ల పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఇతిడిని బెంచ్​కే పరిమితం చేశారు. ఆ తర్వాత మ్యాచ్​లోనే జట్టులోకి వచ్చిన ఇతడు అద్భుత ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. తర్వత ఏడాది కూడా రాజస్థాన్​కే ఆడిన స్మిత్​ను ఈ సీజన్​కు ముందు వదులుకుందీ జట్టు. ప్రస్తుతం ఇతడు దిల్లీకి ఆడుతున్నాడు.

smith
స్మిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.