కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదాపడింది. దీంతో లీగ్లో పాల్గొన్న విదేశీ క్రికెటర్లను వారి దేశాలకు పంపించడానికి సిద్ధమవుతోంది బీసీసీఐ. అందుకు మార్గాలు వెతుకుతున్నామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.
"విదేశీ ఆటాగళ్లను వారి ఇళ్లకు పంపించాల్సిన అవసరం ఉంది. అందుకు తగిన దారిని వెతుకుతున్నాం" అని బ్రిజేష్ స్పష్టం చేశారు..
ప్రస్తుతం ఐపీఎల్లో 14 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు, 10 మంది న్యూజిలాండ్, 11 మంది ఇంగ్లాండ్, 11 దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఉన్నారు. అలాగే 9 మంది వెస్టిండీస్, ముగ్గురు అప్ఘానిస్థాన్, ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఉన్నారు.
టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పాల్గొనేందుకు భారత్-న్యూజిలాండ్ ఆటగాళ్లు ఒకే విమానంలో ఇంగ్లాండ్ పయనమవనున్నారు. అలాగే వీరితో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇదే ఫ్లైట్లో వెళ్లనున్నారు. వీరితో తమని కూడా పంపే ఆలోచన చేయాలని ఇప్పటికే బీసీసీకి విజ్ఞప్తి చేశాడు ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ తెలిపారు.