కోల్‌కతా నైట్ రైడర్స్ దాదాపు ప్లేఆఫ్స్(KKR playoffs) చేరింది. దీనిపై స్పందిస్తూ.. ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Morgan KKR player) సంతోషం వ్యక్తం చేశాడు. గురువారం రాత్రి రాజస్థాన్‌ను ఓడించిన ఆ జట్టు మెరుగైన రన్‌రేట్‌తో కొనసాగుతోంది. ఇక కోల్‌కతా అవకాశాలను గల్లంతు చేయాలంటే ఈరోజు మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్(MI vs SRH) 171 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించాలి. అయితే అది అసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో గతరాత్రి మోర్గాన్ మాట్లాడాడు.
"టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం అంత తేలిక కాదు. అయినా, మా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్‌గిల్ అద్భుతంగా ఆడారు. రెండో దశలో వీరిద్దరూ మా జట్టుకు షైనింగ్ స్టార్స్‌లా మారారు. అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. రాజస్థాన్ బౌలింగ్‌ను మంచి టైమింగ్‌తో ఎదుర్కొన్నారు. ఇక రసెల్ స్థానంలో షకిబ్ జట్టులోకి వచ్చి రాణించడం గొప్పగా ఉంది. అయితే, మేం రసెల్ సేవలను కొద్దిగా మిస్సవుతున్నాం. ఎందుకంటే అతడు సరైన ఆల్‌రౌండర్. గాయం బారిన పడిన అతడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇక ఈ విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరువైనందుకు సంతోషంగా ఉంది" అని మోర్గాన్ వివరించాడు.
ఇక్కడ 171 పరుగులు ఛేదించొచ్చు: సంజూ
అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ ఈ పిచ్‌పై 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చని చెప్పాడు. "ఈ వికెట్‌పై అంత స్కోర్ సాధించొచ్చు. అందుకోసం శుభారంభం చేయాలని అనుకున్నాం. పవర్‌ప్లేలో భారీ పరుగులు సాధించాలనుకున్నాం. దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకున్నా.. వాటిని అమలుచేయలేకపోయాం. అయితే, ఈ సీజన్‌లో మేం చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. మా ఆటగాళ్ల పట్టుదల చూసి నేను గర్వపడుతున్నా. ఒక సారథిగా నేను ఎక్కువ పరుగులు చేయడం కన్నా మరిన్ని విజయాలు సాధించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని. ఈరోజు కోల్‌కతా బాగా ఆడింది. గిల్, రాణా, త్రిపాఠి ప్రతిఒక్కరూ రాణించడం వల్ల మేం మ్యాచ్‌ను కోల్పోయాం. 171 పరుగుల లక్ష్యాన్ని 11 ఓవర్లలో మేం సాధించాలని పంజాబ్ కింగ్స్ ఆశపడింది. కానీ, అది సాధ్యం కాలేదు. 9 ఓవర్లకే మా స్కోర్ 35/7 చూసి ముంబయి కూడా నిరాశ చెంది ఉంటుంది. రాహుల్ తెవాతియా(44) పోరాడినా.. శివమ్ మావి, ఫెర్గూసన్ తమ బౌలింగ్‌తో విజృంభించారు. కేకేఆర్ మెరుగైన రన్‌రేట్‌తో ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా అధికారికంగా తేలేవరకూ వేచి చూడాలి" అని సంజూ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:
KKR Vs RR: రాజస్థాన్‌పై కోల్‌కతా భారీ విజయం.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు!