ETV Bharat / sports

IPL 2021 NEWS: దిల్లీపై ధోనీ ధనాధన్.. వీడియో చూసేయండి! - ధోనీ ఐపీఎల్ 2021 క్వాలిఫయర్

దిల్లీ క్యాపిటల్స్​(dc vs csk 2021)తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్​లో విజయం సాధించి ఫైనల్​కు చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings 2021). ఈ మ్యాచ్​లో తన ధనాధన్ ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్నందించాడు ధోనీ(ms dhoni ipl). ఆఖరి ఓవర్లో కీలక పరుగులు చేసి ఉత్కంఠ పోరును చెన్నై వైపు తిప్పాడు. ఈ నేపథ్యంలో ధోనీ షాట్లను మరోసారి చూసేయండి.

Dhoni
ధోనీ
author img

By

Published : Oct 11, 2021, 12:20 PM IST

Updated : Oct 11, 2021, 1:53 PM IST

దిల్లీ క్యాపిటల్స్‌(dc vs csk 2021)తో జరిగిన క్వాలిఫయర్‌-1లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(chennai super kings 2021) సారథి మహేంద్రసింగ్‌ ధోనీ (18*) మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగితేలారు. చివరి ఓవర్‌లో అతడు మూడు బౌండరీలు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో మీరూ చూసేయండి.

ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై(chennai super kings 2021) ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు చెన్నై ఒక దశలో 111/1తో పటిష్ఠంగా నిలిచి తేలిగ్గా మ్యాచ్‌ను కైవసం చేసుకునేలా కనిపించింది. కానీ, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ధోనీసేన ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న ఉతప్ప(63), శార్దూల్‌ ఠాకూర్‌(0), అంబటి రాయుడు (1) వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి రన్‌రేట్‌ను పెంచారు.

ఇక చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 24 పరుగులు అవసరమైన వేళ అవేష్‌ ఖాన్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి రుతురాజ్‌ (70) ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన ధోనీ(ms dhoni ipl) తర్వాత ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 13 పరుగులు కావాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో అంతగా ఫామ్‌లో లేకపోవడం వల్ల చెన్నై సారథి ఎలా ఆడతాడో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టామ్‌ కరన్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి మొయిన్‌ అలీ(16) ఔటయ్యాడు. దీంతో ఆ జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. సరిగ్గా ఇక్కడే ధోనీ తనలోని పాత ఫినిషర్‌ను బయటికి తీశాడు. ధనాధన్‌ షాట్లతో మూడు ఫోర్లు సంధించి దిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు. టామ్‌ వేసిన రెండో బంతిని ఎక్స్‌ట్రా కవర్లో ఫోర్‌ బాదిన మహీ(ms dhoni ipl).. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడిన తర్వాతి బంతిని కూడా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో బౌండరీ దాటించాడు. దీంతో సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన స్థితికి మారింది. అప్పుడే టామ్‌ వైడ్‌ వేయగా తర్వాతి బంతిని ధోనీ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో మూడో బౌండరీకి తరలించి జట్టును ఫైనల్‌కి చేర్చాడు.

ఇవీ చూడండి: ఎప్పటికీ ధోనీనే గొప్ప ఫినిషర్​: కోహ్లీ

Last Updated : Oct 11, 2021, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.