ETV Bharat / sports

ఐపీఎల్​ తర్వాత వార్నర్​ దారెటు? - డేవిడ్ వార్నర్

ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్న వార్నర్​ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. ఇదే కాకుండా ఆదివారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కనీసం అతడికి ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే ఫామ్​ కారణంగా పక్కన పెట్టారా అంటే.. అతడేమీ పేలవంగా ఆడట్లేదు. ఫ్రాంఛైజీతో విభేదాల వల్లనే వార్నర్​ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐపీఎల్​ ముగిసిన తర్వాత వార్నర్​ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

david warner, sunrisers player
డేవిడ్ వార్నర్, సన్​రైజర్స్​ ఆటగాడు
author img

By

Published : May 3, 2021, 7:12 AM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​ టీమ్​కు కెప్టెన్​గా డేవిడ్​ వార్నర్​ను తప్పించారు.. కనీసం ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. మొన్నటి వరకు కెప్టెన్​గా ఉన్న డేవిడ్ వార్నర్ రాజస్థాన్ రాయల్​తో మ్యాచ్​లో డగౌట్​కే పరిమితమయ్యాడు. భుజంపై తువ్వాలు వేసుకుని.. తోటి ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ. జట్టు మంచి ప్రదర్శన చేసినప్పుడల్లా చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తూ కనిపించాడు. తుదిజట్టు నుంచి తనను తప్పించడం పట్ల వార్నర్ షాక్​కు గురయ్యాడని సన్​రైజర్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ వెల్లడించినప్పటికీ.. ఆ బాధను అతడు ఎక్కడ కనిపించకుండా సరదాగా తిరిగాడు. ఐపీఎల్​లో ఏ జట్టుకు ఆడినా ఫామ్ ఆధారంగా వార్నర్​ను పక్కన పెట్టడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి ఇప్పుడూ అతడి ఫామ్​ పేలవంగానూ లేదు.

ఫ్రాంచైజీ వివరణ ఎలా ఉన్నప్పటికీ అంతర్గత విభేధాల కారణంగానే అతడిపై వేటు పడిందన్నది వాస్తవం. ఇప్పుడిప్పుడే అతడికి ఆడే అవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఈ దశలో తుదిజట్టులో ఆడే విదేశీయుల్లో ఇద్దరు బ్యాట్స్​మన్, ఒక ఆల్ రౌండర్​తో పాటు రషీద్ ఖాన్​ను ఆడించాలన్నది తమ ప్రణాళిక అని మూడీ స్పష్టం చేశాడు. ఇదే ఫార్ములా మిగతా మ్యాచ్​ల్లోనూ అమలు చేస్తే కెప్టెన్ విలియమ్సన్, బెయిర్ స్టో ఉండడం ఖాయం. రషీద్ ఖాన్ ఎలాగూ ఉంటాడు. కాబట్టి.. మరో బెర్తు ఆల్​రౌండర్​దే. వార్నర్ మరికొన్ని మ్యాచ్​లకు డగౌట్​కు పరిమితం కావొచ్చు.

మనీశ్​​ను​ తుది జట్టులో ఆడించకపోవడంపై వార్నర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం ఫ్రాంచైజీకి కోపం తెప్పించివుండొచ్చు. అయితే ఈ ఒక్క కారణంతోనే సన్​రైజర్స్ ఫ్రాంచైజీ వార్నర్​ను తప్పిస్తుందని అనుకోలేం. అతడి విభేదాలు మూడీ వరకే పరిమితం కాలేదని తెలుస్తోంది. ఆ విభేదాలు ఏంటి? ఎప్పుడు మొదలయ్యాయి? అన్నవి ఐపీఎల్ ముగిసేలోపు బయటకు రావొచ్చు. ఆ తర్వాత వార్నర్ ఏం చేస్తాడు? అతని దారెటు అన్నదే ఆసక్తికరం.

ఇదీ చదవండి: ఐపీఎల్: కోహ్లీసేనను కోల్​కతా అడ్డుకోగలదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.