ETV Bharat / sports

అప్పుడు ధూల్ ​పేట్ డేవిడ్​.. ఇప్పుడు దిల్లీ వార్నర్​​​.. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్​కు - ఉప్పల్​ మైదానంలో వార్నర్

చివరగా ఐపీఎల్ 2019 సీజన్​లో​ హైదరాబాద్​లో మ్యాచ్​ ఆడిన వార్నర్.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఉప్పల్​ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్ దిల్లీతో తలబడనుంది. అయితే వార్నర్​ ఈసారి అటు వైపు ఉండడంతో తెలుగు అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు....

srh vs warner
srh vs dc warner
author img

By

Published : Apr 24, 2023, 7:22 PM IST

Updated : Apr 24, 2023, 8:30 PM IST

డేవిడ్‌ వార్నర్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఒకప్పుడు ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ అంటే వార్నర్​.. వార్నర్ అంటే సన్​రైజర్స్ హైదరాబాద్​. 2016లో సన్​రైజర్స్​ను టైటిల్​ విజేతగా నిలబెట్టాడు. జట్టులో కీలక ఆటగాడిగా.. తెలుగు ప్రజల మదిలో నిలిచిపోయాడు వార్నర్​. ప్రత్యర్థి ఎవరైనా మ్యాచ్​ భారాన్ని తన భుజస్కందాలపై మోస్తూ.. జట్టును విజయ తీరాలకు చేర్చేవాడు.

వార్నర్​.. 2014 నుంచి ఏడు సీజన్ల పాటు జట్టుకు బ్యాటర్​గా, కెప్టెన్​గా ఎన్నో సేవలందించాడు. అయితే రెండేళ్ల కింద ఫామ్​ కోల్పోయిన కారణంగా జట్టు యాజమాన్యం అతడిని వదులుకుంది. సన్​రైజర్స్​ తరఫున ఆడిన ప్రతి సీజన్లలోను వార్నరే జట్టులో టాప్​ స్కోరర్​. వార్నర్‌తో పాటు అతడి కుటుంబం మొత్తం ఆరెంజ్‌ ఆర్మీలో భాగమైంది. అయితే ఇప్పుడు వార్నర్​ ఉప్పల్ మైదానంలో సన్​రైజర్స్​ తరఫున కాకుండా దిల్లీ జెర్సీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్​కు వచ్చాడు. ఇది హైదరాబాద్​ అభిమానులను కాస్త కలవరపెడుతోంది. 'ధూల్​పేట్​ డేవిడ్​ భాయ్​' అంటూ ముద్దుగా పిలుచుకునే హైదరాబాదీలు... వార్నర్​ను దిల్లీ డగౌట్​లో చూడలేం అంటున్నారు.

గ్రౌండ్​లో తన ఆటతో ఆకట్టుకునే వార్నర్‌ .. మైదానం వెలుపల మన తెలుగు హీరోల రీల్స్‌ చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకున్నాడు. తెలుగువాడిలా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైపోయాడు. ఇక ప్రత్యర్థిగా మొదటిసారి హైదరాబాద్ వచ్చిన వార్నర్​ ఎలా ఆడతాడు... తెలుగు ప్రేక్షకులు వార్నర్ పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తారన్నది ఈరోజు మ్యాచ్​లో తేలనుంది. మరోవైపు సోషల్​మీడియాలో వార్నర్​పై తెలుగు ప్రేక్షకులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. "డేవిడ్​ భాయ్​ నువ్వు ఏ జట్టులో ఉన్నా.. తెలుగువారికి మాత్రం ఎప్పుడూ హైదరాబాదీవే. మిస్​ యూ సో మచ్​" అంటూ ఫ్యాన్స్​ సోషల్​ మీడియాలో ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉప్పల్‌ స్టేడియంలో వార్నర్‌ 31 ఇన్నింగ్స్‌లో 1602 పరుగులు సాధించాడు. ఇందులో 15 హాఫ్‌ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్​లో ముందుగా టాస్​ గెలిచిన దిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.

తుది జట్లు:
ఎస్‌ఆర్‌హెచ్‌: హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, మార్​క్రమ్​​(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

దిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, రిపాల్ పటేల్, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్.

Last Updated : Apr 24, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.