డేవిడ్ వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. అతడు ప్రపంచ స్థాయి ఆటగాడని ప్రశంసించాడు. త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"సన్‌రైజర్స్ బృందంలో చాలా మంది నాయకులున్నారు. మేం కలిసి కట్టుగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైన మార్పులు చేస్తూ జట్టును పటిష్ఠంగా నిర్మించడం మాకు అవసరం. విజయం కోసం అతిగా వెతకడం కంటే కూడా మేం ఎలా ఆడుతున్నామనేది ప్రధానం. వార్నర్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతను మా పరిగణలోనే ఉన్నాడు. తనను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చర్చలు సాగుతాయని అనుకుంటున్నా."
-సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్
ఇదీ చదవండి: కరోనాతో బీసీసీఐ మాజీ సెలెక్టర్ మృతి
ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శాంసన్ సేన నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు పూర్తిగా తడబాటుకు గురైంది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన ఎస్ఆర్హెచ్ ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఐపీఎల్ తర్వాత వార్నర్ దారెటు?