రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. శ్రీలంక ఆటగాళ్లు వానిండు హసరంగ, దుష్మంత చమీరా ఐపీఎల్-14 సీజన్‌లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు(యస్‌ఎల్‌సీ) అనుమతించింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు వీలుగా నిరభ్యంతర పత్రాన్ని(ఎన్‌వోసీ) అందించినట్లు ఆదివారం లంక బోర్డు తెలిపింది. వానిండు హసరంగ, దుష్మంత చమీరాను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ఆర్సీబీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
వీరిద్దరి చేరికతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారనుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానాన్ని ఆల్‌రౌండర్ హసరంగ భర్తీ చేయనుండగా.. డానియల్ సామ్స్ స్థానంలో దుష్మంత చమీరా జట్టులోకి రానున్నాడు. అయితే, ఈ ఇద్దరు ఆటగాళ్లు అక్టోబర్ 10న తిరిగి శ్రీలంక జట్టుతో కలుస్తారు. అనంతరం టీ20 ప్రపంచకప్ సన్నద్ధత కోసం వార్మప్ మ్యాచులు ఆడనున్నారు. యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్-14 పున:ప్రారంభంకానుంది. అక్టోబర్ 15న దుబాయ్‌లో ఫైనల్ నిర్వహిస్తారు.
ఇవీ చదవండి: