ETV Bharat / sports

పాపాయికి హాఫ్ సెంచరీ..అనుష్కకు ముద్దులు...సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ..! - హాఫ్​సెంచరీ వామికకు అంకితం

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో నమోదు చేసిన తొలి అర్ధసెంచరీని తన కుమార్తె వామికకు అంకితం ఇచ్చాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. హాఫ్​సెంచరీ చేసిన తర్వాత ఆర్​సీబీ బృందంవైపు చూస్తూ తన భార్య అనుష్కకు గాల్లో ముద్దులిచ్చాడు. అంతకంటే ముందు.. తన కూతురును గుర్తుచేసేలా.. చేతులతో ఊయల ఊపాడు.. బీసీసీఐ సోషల్​మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు... వైరల్ అవుతోంది.

Virat Kohli Dedicates Half-Century To Daughter Vamika
​అనుష్కకు ప్రేమతో​.. విరాట్​ కోహ్లీ​
author img

By

Published : Apr 23, 2021, 1:05 PM IST

Updated : Apr 23, 2021, 2:32 PM IST

అద్భుతమైన ఇన్సింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ పై గెలుపులో కీలకపాత్ర పోషించిన ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ.. తన విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సీజన్ లో తాను సాధించిన తొలి అర్థసెంచరీని.. కుమార్తె వామికకు అంకితం ఇచ్చాడు.. గురువారం.. రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో రాజస్థాన్​ను చిత్తు చేసింది కోహ్లీ సేన. ఓపెనర్లు పడిక్కల్, కోహ్లీ కలిసి వికెట్​ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఈ మ్యాచ్​లో పడిక్కల్(101)​ సెంచరీ చేయగా.. విరాట్​ కోహ్లీ(72) అర్ధశతకంతో చెలరేగాడు.

హాఫ్​ సెంచరీ పూర్తి చేసిన తర్వాత తన భార్య, బాలీవుడ్​ నటి అనుష్క శర్మకు గాల్లో ముద్దులిస్తూ.. తన ఆనందాన్ని పంచుకున్నాడు. అలాగే తన కుమార్తెకు తన అర్థ సెంచరీని అంకితం ఇస్తున్నాను అనే సందేశం వచ్చేలా.. కోహ్లీ...చేతులతో ఊయల ఊపుతున్నట్లు అభినయించడం.. ముచ్చట గొల్పింది. ఈ వీడియోను బీసీసీఐ సోషల్​మీడియా షేర్​ చేయగా.. ప్రస్తుతం వైరల్​గా మారింది.

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో 178 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్​సీబీ ఓపెనర్లు..​ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌(101నాటౌట్‌; 52 బంతుల్లో 11x4, 6x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(72 నాటౌట్‌; 47 బంతుల్లో 6x4, 3x6) ధాటిగా ఆడారు. ఓవర్‌కు పది పరుగులకు పైగా చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దాంతో 16.3 ఓవర్లలోనే బెంగళూరును విజయ తీరాలకు చేర్చారు.

ఇదీ చూడండి.. దిల్లీ క్యాపిటల్స్​ క్యాంప్​లో అక్షర్​ పటేల్​

Last Updated : Apr 23, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.