Virat Kohli Catch: క్రికెట్లో కళ్లు చెదిరే సిక్సర్లు చూసుంటారు. కొన్నిసార్లు బ్యాటర్లు కళ్లుమూసుకునే సిక్సర్లను బాదేస్తుంటారు. అది ఫ్యాన్స్‌కు భలే మజా అందిస్తుంది. అయితే కళ్లు మూసుకొని పట్టే క్యాచ్‌లను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. అదీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పట్టినవి. వీటిని తమ ట్విట్టర్లో షేర్ చేసింది ఆర్సీబీ.
ఈ ఫొటోలపై సరదాగా స్పందిస్తున్నారు నెటిజన్లు. కాగ, కోహ్లీ, డుప్లెసిస్.. నిర్ణయాలు ఎంత కచ్చితంగా ఎంటాయో చెప్పేందుకు ఈ క్యాచ్‌లే నిదర్శనమని ఆర్సీబీ పేర్కొంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. ఒక దాంట్లో విజయం సాధించింది. తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 5న తలపడనుంది. దీనికి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆర్సీబీ క్రికెటర్లు.
ఇదీ చూడండి: ఆ ఒక్క ఇన్నింగ్స్.. తెలుగు కుర్రాడిని స్టార్‌ని చేసింది..!