ETV Bharat / sports

ధోనీ వార్నింగ్​.. నో బాల్స్​ వేయడంపై స్పందించిన CSK పేసర్​ - ఐపీఎల్ 2023 చైన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్​

ఐపీఎల్‌ - 2023 సీజన్‌లో బౌలర్ల తీరుపై సీఎస్కే కెప్టెన్‌ ధోనీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను నోబాల్స్‌ వేయడంపై పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే మాట్లాడాడు. ఏమన్నాడంటే..

dhoni warning to tushar deshpande
ధోనీ వార్నింగ్​.. నో బాల్స్​ వేయడంపై స్పందించిన CSK పేసర్​
author img

By

Published : Apr 5, 2023, 2:14 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​-2023 సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచులు ఆడింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఈ సీజన్​ను ఓటమితో ఆరంభించిన ఆ జట్టు.. తన రెండో మ్యాచ్​లో విజయం సాధించింది. అయితే ఈ టీమ్​లో బౌలింగ్ విభాగం పేలవమైన ప్రదర్శన చేస్తూ విమర్శలను ఎదుర్కొంటోంది. ఎక్కువగా వైడ్లు, నోబాల్స్‌ వేసి అదనపు పరుగులు సమర్పించుకుంటోంది. ఈ విషయంపై సీఎస్కే కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసాడు. బౌలర్ల తీరుపై మండిపడ్డాడు కూడా. అయితే తాజాగా ఈ విషయంపై.. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో మూడు నోబాల్స్‌ వేసిన సీఎస్కే పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే మాట్లాడాడు. డెత్‌ ఓవర్లలో బంతులను సంధించడం అంత సులభం కాదని, తాను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నట్లు చెప్పాడు.

"టీ20ల్లో నో బాల్స్​ వేయడం తప్పే. కానీ నేను దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తే మరిన్ని ఎక్కువ పరుగులు అదనంగా సమర్పించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మ్యాచ్‌ రిజల్ట్​ మరోలా ఉంటుంది. నేనెప్పుడూ బాగా రాణించడంపైనే ఫోకస్​ చేస్తాను. టీమ్​ సక్సెస్​ కోసం ఆడాలన్నదే నా ధ్యేయం, తపన. డెత్‌ ఓవర్లలో బౌలింగ్ చేయడం అంత సులభమైన పని కాదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అయినా మాకు డెత్‌ ఓవర్లలో గొప్పగా బౌలింగ్‌ చేసిన ఎక్స్​పీరియన్స్​ కోచ్‌ డీజే బ్రావో ఉన్నారు. ఆయన నుంచి బౌలింగ్ మెలకువలను నేర్చుకుంటున్నాను" అని తుషార్​ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఇప్పటివరకు చెన్నై సూపర్​ కింగ్స్​ ఆడిన రెండు మ్యాచుల్లోనూ 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'గా బరిలోకి దిగిన తుషార్‌ దేశ్​పాండే ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. సీఎస్కే రెండో మ్యాచ్ లఖ్‌నవూతో జరగగా.. ఆ పోరులో.. 4 ఓవర్లు వేసిన మూడు నోబాల్స్‌ ఇచ్చాడు. 45 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు గుజరాత్‌తో జరిగిన పోరులోనూ 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగులను సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్​ మాత్రమే తీశాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతగడ్డపై లఖన్​వూతో జరిగిన మ్యాచ్​లో గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసినప్పటికీ అది అంత ఈజీగా రాలేదు. 13 వైడ్లు, 3 నోబాల్స్‌ వేసి అదనపు పరుగులు సమర్పించుకున్నారు బౌలర్లు. వీరి తప్పిదం వల్ల విజయం కోసం సీఎస్కే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అయిపోయాక బౌలర్ల ప్రదర్శనపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ఆట శైలిని మార్చుకోకపోతే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని సీరియస్ వార్నింగ్​ కూడా ఇచ్చాడు.

ఇదీ చూడండి: దిల్లీ క్యాపిటల్స్​ ప్లేయర్స్​ వైఫ్స్​, గర్ల్​ఫ్రెండ్స్.. వీరు కూడా ఫేమసే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.