ETV Bharat / sports

బ్యాటింగేమో 'కేజీఎఫ్‌'.. బౌలింగేమో 'కబ్జా'.. RCBపై ట్రోల్స్ ఆగట్లేదుగా! - కన్నడ మూవీ కబ్జా

ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా ఇటీవలే జరిగిన లఖ్​నవూ మ్యాచ్​లో ఆర్సీబీ ప్లేయర్స్​ ఓటమిని చవి చూశారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆర్సీబీ అభిమానులు ఈ టీమ్​ను నెట్టింట రెండు కన్నడ సినిమాలను ఆధారంగా చేసుకుని తెగ ట్రోల్ చేయడం ప్రారంభించారు.

rcb fans trolls
rcb fans trolls
author img

By

Published : Apr 12, 2023, 4:40 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా లఖ్​నవూ- బెంగళూరు మ్యాచ్​ జరిగి రెండు రోజులు గడిచింది. కానీ ఆ మ్యాచ్​లో ఓటమిపాలైన బెంగళూరు టీమ్​ను ట్రోలర్స్​ వదలి పెట్టడం లేదు!. ఇప్పటికీ ఇంకా ట్రోల్​ చేస్తూనే ఉన్నారు. బ్యాటింగ్​లో దుమ్మురేపి.. బౌలింగ్​ తేలిపోయిన ఆర్సీబీని వెరైటీ మీమ్స్​తో ట్రోల్ చేస్తూన్నారు.

ఇటీవలే శాండల్​వుడ్​ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న రెండు సినిమాలతో ఈ ఆర్సీబీ టీమ్​ను పోలుస్తూ తెగ ట్వీట్లు చేస్తున్నారు. కేజీఎఫ్ రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా గతేడాది రిలీజైన కేజీఎఫ్ 2 అయితే బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిందనే చెప్పాలి. దీంతో ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని కన్నడ హీరో ఉపేంద్ర లీడ్​ రోల్​లో 'కబ్జా' అనే ఓ సినిమా ఇటీవలే రిలీజయ్యింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. భారీ బడ్జెట్​తో పాటు అభిమానుల్లో హైప్ నింపిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. దీంతో గత నాలుగు వారాలుగా నెటిజన్లు ఈ కబ్జా మూవీని కూడా ట్రోల్ చేస్తున్నారు. కేజీఎఫ్ రేంజ్​లో ఎక్స్​పెక్టేషన్స్​ ఇచ్చిన ఈ సినిమా.. దానికి పూర్తి భిన్నమైన ఫలితాన్ని సాధించింది. ఇక ఇదే పాయింట్​ను ఆధారంగా చేసుకుని ఆర్సీబీ ఫ్యాన్స్ తమ టీమ్​ను తెగ తిట్టిపోస్తున్నారు.

ఆర్సీబీ బ్యాటింగ్ కేజీఎఫ్ లాగా ఉంటే.. బౌలింగే కబ్జాలాగా ఉందని, అందుకే ఈ ఓటములు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఆర్సీబీ కీలకమైన సమయాల్లో బోల్తా పడుతోంది. అందుకే 15 సీజన్లుగా టైటిల్​కు దూరమవుతోందని అభిమానులు అంటున్నారు. ఇక గతంలో గేల్, డివిలియర్స్, కోహ్లీ త్రయం ఉన్నప్పటికీ.. ఇప్పుడు కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్​ త్రయం ఉన్నా కూడా ఆర్సీబీ నిలకడగా విజయాలు సాధించలేకపోతోంది. దీంతో ఫ్యాన్స్​ కూడా తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. బెంగళూరులోని చిన్న స్వామి వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ టీమ్స్​ తలపడ్డాయి. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్​లో లఖ్​నవూ ఘన విజయాన్ని సాధించింది. అయితే టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ టీమ్​ మొదట్లో బాగానే జోరు సాగించింది. విరాట్​ కోహ్లీతో పాటు డుప్లెసిస్‌ రెచ్చిపోగా.. మ్యాక్స్‌వెల్‌ అయితే తన బ్యాటింగ్​ స్కిల్స్​తో మైదానంలో చెలరేగిపోయాడు.

అయితే నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు.. తన ఖాతాలో ఏకంగా 212 పరుగులను స్కోర్​ చేసింది. బ్యాటర్లు ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడినా.. బౌలర్లు మాత్రం కాస్తా ఢీలా పడ్డారు. ఇక ఇదే ఛాన్స్​కు వినియోగించుకున్న లఖ్​నవూ టీమ్​ చివరి బంతి వరకు పోరాడి మరీ 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అటు రాహుల్ సేనలో.. స్టాయినిస్, పూరన్‌ ఆర్సీబీ బౌలర్లను హడలెత్తించారు. అయితే చివర్లో మ్యాచ్‌ ఆర్సీబీ వైపు వెళ్లినట్లు కనిపించినప్పటికీ ఆఖరికి లఖ్‌నవూ టీమ్​ విజయాన్ని మూటగట్టుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.