ఐపీఎల్లో మే 2న సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్కు అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ఇద్దరు బుకీలు ప్రవేశించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నకిలీ అక్రిడేషన్ కార్డులతో వారిద్దరూ మైదానంలో ప్రవేశించారని వెల్లడించారు. వారిలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా.. 5 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే?
సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మే 2 తేదీ(ఆదివారం) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు అనుమానస్పద వ్యక్తులు స్టేడియంలోకి రావడం పోలీసులు గమనించారు. వారిద్దరి గురించి తెలుసుకోగా బుకీలు అని తెలిసింది. ఆ ఇద్దరు బుకీలు నకిలీ కార్డుల ద్వారా స్టేడియంలోకి వచ్చారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇరువురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్కు తరలిచింది. అయితే ఆ నిందుతులు ఎందుకు స్టేడియంలోకి వచ్చారనే విషయాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి: మాజీ క్రికెటర్ కిడ్నాప్.. విడుదల!