సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అమిత్ మిశ్రా కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు ఇప్పటికే కొవిడ్ బారిన పడ్డారు.
"సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అప్పటినుంచి అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. మేము కూడా సాహాకు ఒంటరిగా ఉండమనే సలహానిచ్చాం" అని ఐపీఎల్ అధికార వర్గాలు వెల్లడించాయి.
కాసేపటికే ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది.
ఇదీ చదవండి: నలుగురు మహిళ క్రికెటర్లకు బీసీసీఐ ఎన్ఓసీ