ETV Bharat / sports

'అలా చేస్తే ధోనీ నుంచి మరిన్ని సిక్సులు చూడొచ్చు' - Sunil Gavaskar expects 'more fours and sixes' from MS Dhoni as IPL 2021 progresses

ఈ సీజన్ ప్రారంభంలో ఏడో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన సీఎస్కే కెప్టెన్ ధోనీ.. బుధవారం కోల్​కతాతో మ్యాచ్​లో నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. 8 బంతుల్లోనే 17 పరుగులు చేసిన మహీ.. ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఇకపై కూడా ధోనీ ఇదే స్థానంలో బ్యాటింగ్​కు రావాలని సూచించాడు మాజీ బ్యాటింగ్​ దిగ్గజం సునీల్ గావస్కర్​.

sunil gavaskar, mahendra singh dhoni
సునీల్ గావస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Apr 23, 2021, 3:23 PM IST

బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం శుభపరిణామమని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. మున్ముందు కూడా ఇదే స్థానంలో ఆడితే అతడి నుంచి మరిన్ని సిక్సులు చూడొచ్చన్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 220/3 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు రుతురాజ్‌(64; 42 బంతుల్లో 6x4, 4x6), డుప్లెసిస్‌(95*; 60 బంతుల్లో 9x4, 4x6) శుభారంభం చేయగా తర్వాత మొయిన్‌ అలీ(25; 12 బంతుల్లో 2x2, 2x6), ధోనీ(17; 8 బంతుల్లో 2x4, 1x6) దంచి కొట్టారు.

ఇదీ చదవండి: రికార్డుల ఆటగాడు- ఐపీఎల్ వేటగాడు!

ఈ సీజన్​లో ప్రారంభ మ్యాచ్​ల్లో ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. దీంతో బ్యాటింగ్​ ఆర్డర్​లో మహీ ముందుగా వస్తే ఇంకా బాగా ఆడతాడని గావస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ "ధోనీ బ్యాటింగ్‌ చేయడం ఇండియా మొత్తం ఆస్వాదిస్తుంది. టోర్నీ జరిగే కొద్దీ అతడెంత ఎక్కువ బ్యాటింగ్ చేస్తే అంత ఎక్కువ రాణిస్తాడు. ఇలాగే నాలుగైదు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తే.. ధోనీ బ్యాట్‌ నుంచి మరిన్ని సిక్సులు, ఫోర్లు మనం చూసే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మొయిన్‌ అలీ ఔటయ్యాక ఆ పరుగుల ప్రవాహాన్ని అలాగే కొనసాగించాలనుకున్నాడు. దాంతో రాయుడు, రైనా, జడేజా కన్నా ఆ పరిస్థితుల్లో అతడే అవసరమని భావించాడు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడి రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు" అని గావస్కర్‌ వివరించాడు.

ఇదీ చదవండి: పాపాయికి హాఫ్ సెంచరీ.. అనుష్కకు ముద్దులు.. సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.