ETV Bharat / sports

Warner SRH News: 'కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో..' - ఎస్​ఆర్​హెచ్​ న్యూస్

సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు కెప్టెన్​గా తనను ఎందుకు తప్పించారో తెలియదని చెప్పాడు డేవిడ్ వార్నర్(Warner SRH News). కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోవడం కష్టమని పేర్కొన్నాడు.

david warner
డేవిడ్ వార్నర్
author img

By

Published : Oct 13, 2021, 7:26 AM IST

కెప్టెన్సీ నుంచి తనను తప్పించడానికి కారణమేంటో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం తనకు చెప్పలేదని డేవిడ్‌ వార్నర్‌(Warner SRH News) చెప్పాడు. తొలి అంచె ఐపీఎల్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో అయిదు ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా.. వార్నర్‌(Warner SRH Issue) స్థానంలో విలియమ్సన్‌ను కెప్టెన్‌గా(Williamson SRH captain) నియమించారు. అయినా ఆ జట్టు రాత మారలేదు. యూఏఈలోనూ ఘోరంగా విఫలమై అట్టడుగు స్థానంతో టోర్నీని ముగించింది. పేలవ ఫామ్‌లో ఉన్న వార్నర్‌కు చివరి మ్యాచ్‌ల్లో తుది జట్టులో కూడా స్థానం దక్కలేదు.

"సన్‌రైజర్స్‌ యజమానులు, బేలిస్‌, లక్ష్మణ్‌, మూడీ, మురళీ అంటే నాకు గౌరవం ఉంది. ఓ నిర్ణయం తీసుకున్నారంటే.. ఏకగ్రీవంగానే తీసుకుని ఉంటారు. ఎవరు నాకు మద్దతిచ్చారో, ఎవరు ఇవ్వలేదో తెలుసుకోలేం. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణాన్ని చెప్పకపోవడం నిరాశ కలిగించింది"

--డేవిడ్ వార్నర్, బ్యాట్స్​మన్.

కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోవడం కష్టమని చెప్పాడు వార్నర్. తాను కొన్ని మ్యాచ్‌ల్లోనే విఫలమయ్యానని అన్నాడు. 'కెప్టెన్సీని తొలగించడాన్ని జీర్ణించుకోవడం కష్టం. నా ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. కానీ అన్నీ మరిచి ముందుకు సాగిపోవాల్సిందే' అని వార్నర్‌ చెప్పాడు. మళ్లీ సన్‌రైజర్స్‌కు ఆడడం తనకు ఇష్టమే అయినా.. అది యజమానుల చేతుల్లో ఉందని అన్నాడు.

ఇదీ చదవండి:

T20 World Cup 2021: నిన్న ఉమ్రాన్​ మాలిక్​.. నేడు ఆవేశ్​ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.