ETV Bharat / sports

రాజస్థాన్​తో మ్యాచ్​.. కెప్టెన్సీ మార్పుతో సన్​రైజర్స్ - హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ లైవ్ స్కోర్

ఈ సీజన్​లో వరుస ఓటములతో ఢీలాపడ్డ రెండుజట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో కొత్త కెప్టెన్​ విలియమ్సన్​తో సన్​రైజర్స్ హైదరాబాద్ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. గెలుపు బాట పట్టాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది.

RRvsSRH
రాజస్థాన్, సన్​రైజర్స్
author img

By

Published : May 2, 2021, 5:32 AM IST

ఈ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో ఢీలాపడ్డాయి. జట్టులో మార్పులు చేసినా ఫలితం రావట్లేదు. ఇప్పటివరకు చెరో ఆరు మ్యాచ్​లు ఆడిన ఇరుజట్లలో రాజస్థాన్ రెండింటిలో విజయం సాధించగా.. కేవలం ఒకే ఒక గెలుపుతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది సన్​రైజర్స్. నేడు ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. దిల్లీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.

కెప్టెన్ మార్పు పనిచేస్తుందా!

రాజస్థాన్​తో మ్యాచ్​కు ముందు విలియమ్సన్​కు కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పింది సన్​రైజర్స్. రెండేళ్లుగా జట్టుగా కెప్టెన్​గా వ్యవహరిస్తోన్న వార్నర్​కు ఉద్వాసన పలికింది. ఇతడు తుదిజట్టులోనూ ఉండటం అనుమానమే. దిల్లీతో మ్యాచ్​లో మెరుగైన ప్రదర్శన చేసినా సూపర్ ఓవర్​ దాకా వచ్చిన మ్యాచ్​ను చేజార్చుకుంది హైదరాబాద్. దీంతో ఈ మ్యాచ్​లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

వార్నర్ అనుమానమే!

ఈ మ్యాచ్​లో బ్యాటింగ్ ఆర్డర్​లో మార్పులు చేయనుంది సన్​రైజర్స్. వార్నర్ స్థానంలో జాసన్ రాయ్​ను ఎంపిక చేసే ఆలోచనలో ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బెయిర్​స్టోతో రాయ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. వీరిద్దరూ ఇంగ్లాండ్ జట్టుకు గొప్ప ఆరంభాలనిచ్చారు. ఒక వేళ వార్నర్​ స్థానంలో మరో ఆల్​రౌండర్​ను తీసుకోవాలనుకుంటే జాసన్ హోల్డర్ మంచి ఎంపిక. దీంతో వీరిద్దరిలో ఒకరు తుదిజట్టులో చోటు దక్కంచుకునే అవకాశం ఉంది. టాపార్డర్​లో మనీష్ పాండే, విలియమ్సన్ మరింతగా ఆకట్టుకోవాల్సి ఉంది. అలాగే జట్టుకు మిడిలార్డర్ పెద్ద సమస్యగా మారింది.

బౌలింగ్​లో అప్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్​పైనే ఎక్కువగా ఆధారపడుతోంది సన్​రైజర్స్. గత ఆరు మ్యాచ్​లో మంచి ప్రదర్శన చేసిన ఇతడకి మద్దతుగా మరో బౌలర్ కరవయ్యాడు. నాలుగు మ్యాచ్​ల్లో మూడు వికెట్లు తీసిన భువనేశ్వర్​ చివరి రెండు మ్యాచ్​ల్లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. అలాగే ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ మరింతగా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.

రాజస్థాన్ మెప్పిస్తుందా!

ఇక రాజస్థాన్ రాయల్స్​ది దాదాపు ఇదే సమస్య. ఈ జట్టులోనూ స్థిరత్వం కొరవడింది. కోల్​కతాతో మ్యాచ్​ ఓడి ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఈ జట్టు ఆ తర్వాత ముంబయిపై ఓటమి చవిచూసింది. కీలక విదేశీ ఆటగాళ్లు జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ గాయాల కారణంగా జట్టుకు దూరమవడం వీరికి పెద్ద సమస్యగా మారింది. బ్యాటింగ్​లో వీరు ఎక్కువగా కెప్టెన్ సంజూ శాంసన్​పైనే ఆధారపడుతున్నారు. ఇతడు ఓ మ్యాచ్​లో సెంచరీతో అలరించినా.. ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ ఆరు మ్యాచ్​లో కేవలం ఒక అర్ధసెంచరీ మాత్రమే చేశాడు. మిడిలార్డర్​లో మిల్లర్, రియాన్ పరాగ్ సత్తాచాటాలని యాజమాన్యం భావిస్తోంది.

బౌలింగ్​లోనూ స్థిరమైన ప్రదర్శన కనబర్చలేకపోతుంది రాజస్థాన్. ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్ ఇప్పటికి 11 వికెట్లతో రాణిస్తున్నా.. ఇతడికి మద్దతుగా నిలవలేకపోతున్నారు మిగతా బౌలర్లు. ముస్తాఫిజుర్ రెహ్మన్, ఉనద్కత్ వారి స్థాయిలో రాణించలేకపోతున్నారు. యువ పేసర్ చేతన్ సకారియా పర్వాలేదనిపిస్తున్నాడు. స్పిన్ విభాగంలో ఈ జట్టు మరీ బలహీనంగా కనిపిస్తోంది. రాహుల్ తెవాటియా ఇప్పటివరకు కేవలం ఒక వికెట్ మాత్రమే సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.