ETV Bharat / sports

రషీద్​ బౌలింగ్​కు వణికిపోతున్న రస్సెల్​!

ఐపీఎల్​ అంటే ముచ్చటపడి బౌండరీలు బాదే విండీస్ విధ్వంసకారుడు రస్సెల్​.. సన్​రైజర్స్​ బౌలర్​ రషీద్​ ఖాన్ బౌలింగ్​లో మాత్రం వణికిపోతున్నాడట. రషీద్​ బౌలింగ్​లోనూ తాను వరుసగా నాలుగు సార్లు ఔటవ్వడమే అందుకు కారణమని తెలుస్తోంది.

Russell struggling in Rashid Khan bowling
రషీద్​ బౌలింగ్​కు వణికిపోతున్న రస్సెల్​!
author img

By

Published : Apr 12, 2021, 7:51 PM IST

Updated : Apr 12, 2021, 9:08 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తురుపు ముక్క.. రషీద్‌ ఖాన్‌. తన మిస్టరీ స్పిన్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. జట్టుకు విజయాలు అందించాడు. అందుకే అలవోకగా పరుగులు చేసే ఎంతటి బ్యాట్స్‌మన్‌ అయినా అతడికి భయపడుతుంటారు. అతడు బౌలింగ్​కు వచ్చాడంటే ఆచితూచి ఆడతారు. వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ సైతం ఇదే కోవలోకి వస్తాడు.

రషీద్‌ బౌలింగ్‌లో రస్సెల్​కు మెరుగైన రికార్డు లేదు. సిక్సర్లు బాదకుండా ఎవరినీ వదిలిపెట్టని అతడు ఈ అఫ్గాన్‌ వీరుడు వస్తే మాత్రం వణికిపోతాడు! ఎందుకంటే హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందు టీ20 క్రికెట్లో అతడిని రషీద్‌ మూడుసార్లు ఔట్‌ చేశాడు. కేవలం 28 బంతులు విసిరి 48 పరుగులే ఇచ్చాడు. ఈ మ్యాచ్​లో 7, 9, 13 ఓవర్లు వేసిన అతడికి కాసేపటి వరకు బంతినివ్వలేదు కెప్టెన్​ వార్నర్​.

ఇదీ చదవండి: మనీష్​ వల్లే సన్​రైజర్స్​ ఓడిపోయింది!: సెహ్వాగ్​

ఎప్పుడైతే రస్సెల్ క్రీజులోకి వచ్చాడో వెంటనే వార్నర్‌.. రషీద్‌ను రంగంలోకి దించాడు. అతడు రాంగ్‌ అన్‌(wrong un/గూగ్లీకి మరో రూపం)గా వేసిన 16.1 బంతి రస్సెల్‌ లెగ్‌సైడ్‌ నుంచి బౌండరీకి వెళ్లింది. దాంతో వైడ్ రూపంలో 5 పరుగులొచ్చాయి. ఆ తర్వాతా రషీద్ రాంగ్‌ అన్‌ వేసి‌ పరుగు ఇవ్వలేదు. ఇక డిఫెన్స్‌ను ఛేదించేందుకు వచ్చిన రెండో బంతిని రస్సెల్‌ భారీ షాట్‌ ఆడాడు. లాంగ్‌ఆన్‌ మీదుగా గాల్లోకి లేచిన బంతిని మనీశ్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి ఒడిసిపట్టాడు. దాంతో రషీద్‌ 48 బంతుల్లో రస్సెల్‌ను నాలుగు సార్లు పెవిలియన్​కు‌ పంపినట్టు అయింది.

ఇదీ చదవండి: హార్దిక్​ బౌలింగ్ చేయకపోవడానికి కారణమదే!

Last Updated : Apr 12, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.