ఐపీఎల్లో (IPL 2021) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి రాజస్థాన్ రాయల్స్, గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (RR vs SRH) సోమవారం తలపడనున్నాయి.
ఐపీఎల్ రెండో దశలో (IPL 14) దిల్లీ, పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది సన్‌రైజర్స్. 9 మ్యాచుల్లో 8 ఓడిపోయి ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆ జట్టుపై గెలిచి ప్లే ఆఫ్ ఆశలను పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్. అయితే అతడికి మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందాల్సి ఉంది (RR vs SRH preview).
బ్యాటింగ్ మెరుగుపడేనా?
9 మ్యాచుల్లో 8 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది రాజస్థాన్ (Rajasthan Royals). ఐపీఎల్ రెండో దశలో పంజాబ్‌పై నెగ్గిన సంజూ సేన.. దిల్లీతో శనివారం మ్యాచ్‌లో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలింగ్ విభాగం మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ, దిల్లీ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ సంజూ శాంసన్ మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ రాణించలేదు.
గెలుపు బాట పట్టేనా?
సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad).. ఈ టోర్నీలో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ సహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవుతుండగా.. బౌలింగ్‌లో ఆశలన్నీ రషీద్ ఖాన్పైనే ఉన్నాయి. రాజస్థాన్‌కు పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా బలంగా కనిపిస్తున్నారు.
ఇదీ చూడండి: IND Vs ENG: రద్దయిన టెస్టు నిర్వహణపై క్లారిటీ