త్వరలో మొదలయ్యే ఐపీఎల్ రెండో దశలోనూ(IPL 2021) దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఉంటాడని యాజమాన్యం స్పష్టం చేసింది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వల్ల పంత్‌ను సారథిగా నియమిస్తూ.. ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 14వ సీజన్ రెండో భాగంలోనూ పంత్‌ను(Rishabh Pant) కెప్టెన్‌గా కొనసాగించనునట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఐపీఎల్-14 లీగ్ పాయింట్ల పట్టికలో(IPL 2021 Points Table) దిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో చెన్నై, బెంగళూరు జట్లు ఉన్నాయి. 8 పాయింట్లతో ముంబయి జట్టు నాలుగో స్థానంలో ఉంది. అయితే లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నిర్వహించనున్నారు. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021) జరగనుంది.
ఇదీ చూడండి.. IPL 2022: కొత్త జట్ల కనీస ధర పెంపు.. బోర్డుకు కాసుల వర్షమే!