Rishabh Pant Fined: దిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్! ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్, పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు భారీ జరిమానా పడింది. సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది ఐపీఎల్. పంత్, ఆమ్రేలకు 100శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించగా, శార్దూల్‌పై 50శాతం ఫైన్ పడింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అందుకు కారణం. ఈ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది దిల్లీ.
ఇదీ జరిగింది: గతరాత్రి రాజస్థాన్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీకి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో రోమన్ పావెల్ (36; 15 బంతుల్లో 5x6) తొలి 3 బంతుల్ని 3 సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. అయితే, మూడో బంతి అతడి నడుముపైకి రావడం వల్ల అది నోబాల్‌లా కనిపించింది. దీనిపై పావెల్ ఫీల్డ్ అంపైర్లను నిర్ధారించుకోవాలని అడిగినా వాళ్లు థర్డ్ అంపైర్‌కు నివేదించలేదు. దీంతో కాసేపు మైదానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అందుకు నిరసనగా దిల్లీ కెప్టెన్ పంత్.. తమ బ్యాట్స్‌మెన్‌ను మైదానం వీడి బయటకు రావాలని పిలిచాడు. వెంటనే సహాయ కోచ్ ఆమ్రె కలగజేసుకొని మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. తర్వాత పరిస్థితులు సద్దుమణగడం వల్ల మ్యాచ్ జరిగింది. అయితే పంత్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మాజీలు పంత్‌ను తప్పు పడుతుండగా, అది నోబాల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
-
#RishabhPant 😯🤯🔥
— Anmol Narang (@Anmol_Narang_) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Whole incident on umpiring.....#DCvsRR #DCvRR #RRvsDC #RRvDC #IPL2022 #IPL #umpire #noball #Shardulthakur #SanjuSamson #umpiring #Cheater @RishabhPant17 @IamSanjuSamson #DelhiCapitals #shanewatson #rovmanpowell @tanay_chawda1 @Cricketracker #JosButler pic.twitter.com/NRYdlMxrZk
">#RishabhPant 😯🤯🔥
— Anmol Narang (@Anmol_Narang_) April 22, 2022
Whole incident on umpiring.....#DCvsRR #DCvRR #RRvsDC #RRvDC #IPL2022 #IPL #umpire #noball #Shardulthakur #SanjuSamson #umpiring #Cheater @RishabhPant17 @IamSanjuSamson #DelhiCapitals #shanewatson #rovmanpowell @tanay_chawda1 @Cricketracker #JosButler pic.twitter.com/NRYdlMxrZk#RishabhPant 😯🤯🔥
— Anmol Narang (@Anmol_Narang_) April 22, 2022
Whole incident on umpiring.....#DCvsRR #DCvRR #RRvsDC #RRvDC #IPL2022 #IPL #umpire #noball #Shardulthakur #SanjuSamson #umpiring #Cheater @RishabhPant17 @IamSanjuSamson #DelhiCapitals #shanewatson #rovmanpowell @tanay_chawda1 @Cricketracker #JosButler pic.twitter.com/NRYdlMxrZk
ఇవీ చూడండి:
'మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు?'.. పంత్, ఆమ్రేపై పీటర్సన్ ఫైర్
No Ball Controversy: 'అది కరెక్ట్ కాదు కానీ.. మాకూ అన్యాయం జరిగింది'